క్రిష్‌ని బ‌త‌క‌నిస్తాడా?

Last Updated on by

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం `ఎన్టీఆర్‌`. లెజెండ్ నంద‌మూరి తారక‌రామారావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. బాల‌య్య‌, విష్ణు ఇందుకూరి నిర్మాత‌లు. ద‌ర్శ‌కుడు తేజ‌కు బాల‌య్య‌తో డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే బాల‌కృష్ణ ఎంతో పోయెటిక్‌గా ఓ వీడియోని రిలీజ్ చేస్తూ క్రిష్‌ని ద‌ర్శ‌కుడిగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం మ‌ణిక‌ర్ణిక ద‌ర్శ‌క‌త్వంలో బిజీగా ఉన్న క్రిష్ త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టు కోసం స‌న్నాహాలు చేస్తున్నారు.

తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఈ సినిమా స్క్రిప్టులో అవ‌స‌రం మేర మార్పు చేర్పులు చేస్తున్నార‌ట‌. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి గ్రేట్ మూవీ ఇచ్చిన‌ క్రిష్‌పై న‌మ్మ‌కంతో బాల‌య్య ఈ క్రేజీ ప్రాజెక్టును అత‌డి చేతిలో పెట్టారుట‌. అయితే ఎన్టీఆర్ పాత్ర చిత్ర‌ణ విష‌యంలో త‌న‌కు అంత స్వేచ్ఛ‌నిస్తారా? క‌న్ఫ్యూజ్ చేస్తారా? అంటూ జ‌నం మాట్లాడుకుంటున్నారు. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడిగా బాల‌య్య‌పై ఎప్పుడూ ఈ త‌ర‌హా ఫిర్యాదు లేనేలేదు. ఒక‌సారి క‌థ ఓకే చేసి సినిమాకి సంత‌కం చేశాక బాల‌య్య ఇక బాధ్య‌త‌ల‌న్నీ ద‌ర్శ‌కుడికే వ‌దిలేస్తారు. క్రియేటివ్ పార్ట్‌లో వేలు పెట్ట‌రు. కానీ తొలిసారి త‌న తండ్రిగారైన తార‌క‌రామునికి కానుక‌నివ్వాల‌న్న త‌ప‌న‌తో ఎన్టీఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు కాబ‌ట్టి ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటున్నారు. ఆ క్ర‌మంలోనే తేజ‌తో విబేధాలొచ్చాయి. ఇప్పుడు అదే క్రిష్ విష‌యంలో రిపీటైతే? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. కానీ అందుకు ఆస్కారం లేద‌ని, గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని తెర‌కెక్కించిన వాడిగా క్రిష్‌పై ఆ గౌర‌వం ఉంది క‌నుకే ఈ అవ‌కాశం ఇచ్చార‌ని చెబుతున్నారు. అయితే క్రిష్ ఈ చిత్రానికి కోప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకు బాల‌య్య ఛాన్సిస్తారా? లేదా? అన్న‌ది వేచి చూడాలి.

User Comments