రెండుగా చీలిన బ‌యోపిక్‌

Last Updated on by

అవును .. నిజ‌మే.. గ‌త కొంత‌కాలంగా సాగుతున్న ఊహాగానానికి ఇక చెక్ ప‌డిన‌ట్టే. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `ఎన్టీఆర్‌` చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తోంది. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముని జీవిత‌క‌థ‌ను రెండుగా డివైడ్ చేసి క్రిష్ భారీ ప్ర‌యోగానికే తెర లేపుతున్నాడ‌న్న‌ది తాజాగా అందిన వార్త‌.

వాస్త‌వానికి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని కేవ‌లం ఒకే సినిమాగా తీయాల‌ని ఆరంభ ద‌ర్శ‌కుడు తేజ భావించారు. అందుకు త‌గ్గ‌ట్టే క‌థ‌ను రెడీ చేసుకున్నారు. కానీ అత‌డు ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాక‌, క్రిష్ బ‌రిలో దిగి మొత్తం మార్చేస్తున్నాడు. స్క్రిప్టుని రెండు సినిమాల‌కు స‌రిప‌డేంత పొడిగిస్తున్నాడ‌ట‌. ఇక ఈ విష‌యంలో క్రిష్ నిర్ణ‌య‌మే అల్టిమేట్ అని బాల‌య్య‌బాబు ఫ్రీడ‌మ్ ఇచ్చార‌ని చెబుతున్నారు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని ఇచ్చిన క్రిష్‌పై న‌ట‌సింహా పూర్తి న‌మ్మ‌కం ఉంచార‌ట‌. ఒక లెజెండ్ జీవిత‌క‌థ‌ను ఎన్ని భాగాలుగా అయినా చూపించ‌వ‌చ్చు. చూపించే ద‌మ్ము ఉండాలి కానీ! అయితే తొలి భాగం విజ‌యంపై సీక్వెల్ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డుతుంది కాబ‌ట్టి పార్ట్ -1 మ‌స్ట్‌గా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ ఒక్క అంకం గ‌ట్టెక్కించేందుకు క్రిష్ ఎలాంటి మిరాకిల్స్ చేస్తాడో చూడాలి. ఇక డైలాగ్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్‌కి డ‌బుల్ వ‌ర్క్ పెరిగిన‌ట్టే మ‌రి!

User Comments