వెంక‌టేశ్ చేతిలో ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్..

ఇంజ‌నీరింగ్ సీట్ రావాలంటే ముందు ఎంసెట్ లో ర్యాంక్ కొట్టాలి. అంతే.. అలా ఓ దానికి మ‌రో దానికి లింక్ ఉంటుంది. ఇండ‌స్ట్రీలో కూడా అంతే. కొన్ని సినిమాల భ‌విష్య‌త్తు ఇంకొంద‌రి చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు వెంక‌టేశ్ చేతిలో ఎన్టీఆర్ భ‌విష్య‌త్తు ఉంది. ఎన్టీఆర్ అంటే జూనియ‌ర్ కాదండీ బాబూ.. సీనియ‌రే. ఆయ‌న‌కు భ‌విష్య‌త్తు ఏంటి అనుకుంటున్నారా..? అవును.. నిజంగానే ఇప్పుడు వెంక‌టేశ్ చేతుల్లోనే ఎన్టీఆర్ ఫ్యూచ‌ర్ ఉంది. కాక‌పోతే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. గురు త‌ర్వాత మ‌రే సినిమాకు సైన్ చేయ‌ని వెంక‌టేశ్ ఇప్పుడు తేజ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రంపై తేజ కూడా అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే తాను వెంకీతో సినిమా చేయ‌నున్నాన‌ని క్లారిటీ ఇచ్చాడు ఈ ద‌ర్శ‌కుడు.
ఇక్క‌డే అస‌లు క‌థ ఉంది.

వెంక‌టేశ్ తో పాటు ఎన్టీఆర్ బ‌యోపిక్ కూడా క‌మిట‌య్యాడు తేజ. బాల‌య్య హీరోగా తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని ఆయ‌నే త‌న బ్ర‌హ్మ‌తేజ బ్యాన‌ర్ పై నిర్మించ‌బోతున్నాడు. వ‌చ్చే మార్చ్ నుంచి సినిమా ప్రారంభం కానుంది. ఆ లోపు వెంక‌టేశ్ సినిమాను పూర్తి చేయాల‌నేది తేజ ప్లాన్. అస‌లు విష‌యం ఏంటంటే.. వెంకీ సినిమా హిట్టైతే గానీ బాల‌య్య చేయ‌బోయే ఎన్టీఆర్ బ‌యోపిక్ తేజ చేతికి రాద‌నేది ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న వార్త‌లు. తాను ఈ చిత్రం చేయాలంటే ముందు మ‌రో సినిమా చేసి స‌త్తా నిరూపించుకోవాలనే కండీష‌న్ బాల‌య్య పెట్టాడ‌ని తెలుస్తోంది. అందుకే ముందు వెంకీ సినిమాను ట్రైల‌ర్ లా చూపించ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

నిజానికి వెంక‌టేశ్ తోనూ నేనేరాజు నేనేమంత్రి కంటే ముందే ఓ సినిమా చేయాలి తేజ‌. కాక‌పోతే అప్పుడు తేజ ఉన్న ప‌రిస్థితుల్లో ఆయ‌న్ని న‌మ్మ‌లేక‌పోయాడు వెంక‌టేశ్. ఇప్పుడు మ‌ళ్లీ అదే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుందా.. లేదంటే కొత్త క‌థ‌తో వెంకీని మెప్పించాడా అనేది తెలియాలి. నేనేరాజు నేనేమంత్రి త‌ర‌హాలో ఇది కూడా పొలిటిక‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. అయితే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌తోనే వెంక‌టేశ్ సినిమా ఉండ‌బోతుంది. ఈ చిత్రం హిట్టైతే కానీ బాల‌య్య చేయబోయే ఎన్టీఆర్ బ‌యోపిక్ చేతికి రాదు. మొత్తానికి లింక్ భ‌లే కుదిరింది. ఇప్పుడు చెప్పండి.. ఎన్టీఆర్ భ‌విష్య‌త్తు ఉన్న‌ది ఇప్పుడు వెంకీ చేతుల్లోనే క‌దా..!