ఎన్టీఆర్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్‌

Last Updated on by

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `అర‌వింద స‌మేత‌` ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ద‌స‌రా సెల‌వుల్ని ఎన్‌క్యాష్ చేసుకోవ‌డ‌మే ధ్యేయంగా ఆ తేదీని మేక‌ర్స్ లాక్ చేశారు. అయితే ఈ డెడ్‌లైన్‌ని అందుకోవాలంటే అందుకు త‌గ్గ‌ట్టే చిత్రీక‌ర‌ణ‌ వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని ట్రేడ్‌లో చ‌ర్చ సాగుతోంది. మాట‌ల మాయావి స్లోఫేస్ వ‌ర్కింగ్ స్టైల్‌పై కొద్దిపాటి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే తార‌క్ & టీమ్ మాత్రం జెన్యూన్‌గా కావాల్సిన‌న్ని కాల్షీట్లు ఇచ్చి త్రివిక్ర‌మునికి అన్నివిధాలా స‌హ‌క‌రించ‌డం సానుకూలాంశం. సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ ఎన్టీఆర్ భారీ మొత్తంలో కాల్షీట్లు కేటాయించారు. ఆ నెలాఖ‌రు నాటికే అన్ని ప‌నులు పూర్తి చేసి త్రివిక్ర‌మ్ తొలికాపీని సిద్ధం చేయాల్సి ఉంటుంది. లేదంటే ముందే ప్ర‌క‌టించిన‌ట్టు ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

తాజా గ‌ణాంకం ప్ర‌కారం.. అర‌వింద స‌మేత‌కు 40 ప్ల‌స్ డేస్ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇక తార‌క్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన‌ట్టే. త్రివిక్ర‌మ్ వేగంగా పూర్తి చేస్తేనే అక్టోబ‌ర్ 11కి ఈ సినిమాని రిలీజ్ చేయ‌గ‌ల‌రు. మ‌ధ్య‌లో ఎలాంటి గ్యాప్‌లు లేకుండా సెల‌వులు తీసుకోకుండా ప‌ని చేస్తేనే ఆన్‌టైమ్ రిలీజ్ చేయ‌గ‌ల‌ర‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ బృందం ఈ విష‌యాన్ని గ్ర‌హించి ప‌క్కాగా ప్లాన్ చేశార‌నే భావిద్దాం. దాదాపు 100 కోట్ల మేర బిజినెస్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కం కాబ‌ట్టి అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నార‌నే అనుకోవాలి.

User Comments