ఎన్టీఆర్ కు బాగా కోప‌మొచ్చిందిగా.. 

జై ల‌వ‌కుశ స‌క్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌న అన్న‌య్య నిర్మాణంలో చేసిన తొలి సినిమాకు ఇంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నాడు యంగ్ టైగ‌ర్. ఇక ఇదే వేడుక‌లో చివ‌ర్లో రివ్యూ రైట‌ర్ల‌కు చాలా క్లాస్ గా క్లాస్ పీకాడు ఎన్టీఆర్. ఓ సినిమా విడుద‌ల‌వుతుందంటే.. అది ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న పేషెంట్ తో స‌మానం.. దాన్ని బ‌తికించే హ‌క్కు డాక్ట‌ర్లైన ప్రేక్ష‌కుల‌కు ఉంటుంది. అంతేకానీ.. మ‌ధ్య‌లో వ‌చ్చి వాడు పోతాడు పోతాడు.. క‌చ్చితంగా పోతాడు అని చెప్ప‌డానికి మీరెవ‌రు..? ఆ పేషెంట్ ఉంటాడో పోతాడో డిసైడ్ చేయాల్సింది డాక్ట‌ర్లు క‌దా.. మీరెందుకు మ‌ధ్య‌లో గోల చేస్తున్నారంటూ నైస్ గా విశ్లేష‌కుల‌కు పంచేసాడు ఎన్టీఆర్. ఒక‌వేళ నిజంగానే వాడు చ‌చ్చిపోతే.. మ‌రో పేషెంట్ ను తీసుకొస్తాం.. అంతేకానీ బ‌తికున్న వాన్ని కూడా చంపేయ‌డం మాత్రం బాగోలేదంటున్నాడు ఎన్టీఆర్. త‌మ ఆవేద‌న అర్థం చేసుకోండి అంటూ త‌ప్పుంటే క్ష‌మించండ‌న్నాడు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ తో పాటు ఆ మ‌ధ్య డిజే ప్ర‌మోష‌న్ లో బ‌న్నీ కూడా రివ్యూ రైట‌ర్ల‌పై ఫైర్ అయ్యాడు. ఒకప్పుడు రివ్యూలనేవి ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు అవే ఇష్యూ అయిపోయింది. తొలిరోజు తొలి షోకే సినిమా ఇలా ఉంద‌ని అని చెప్పేస్తే ప్రేక్ష‌కుడు ఆ సినిమాను ఇంకేం ఎంజాయ్ చేస్తాడని అడుగుతున్నాడు బ‌న్నీ. ఎవ‌డో తెల్లోడు తీసిన టైటానిక్ సినిమా అద్భుతం అంటాడు గానీ మ‌న ద‌గ్గ‌ర వ‌చ్చిన సినిమాల‌ను మాత్రం బాలేద‌ని చెప్తాడు రివ్యూ రైట‌ర్. అదే మ‌న ద‌గ్గ‌ర ఉన్న ద‌రిద్రం. మ‌న సినిమాను మ‌నం గౌర‌వించ‌క పోతే ఇంకెవ‌డు గౌర‌విస్తాడు..? ఇవాళ దేశ‌మంతా బాహుబ‌లి అద్భుతం అంటున్నారంటే అందులో అన్ని ఎమోష‌న్స్ తో పాటు పాట‌లు, ఫైట్లు, కామెడీ ఉన్నాయి. అందుకే ఆ సినిమా అలా ఉంది. మ‌న తెలుగు సినిమా క‌మ‌ర్షియ‌ల్ జోన‌ర్ లో ఉన్న మ‌ల్టీ జోన‌ర్ మూవీ. అది అర్థం చేసుకోకుండా రివ్యూల్లో రొటీన్ సినిమాలు చేస్తున్నార‌ని రాయ‌డం బాలేదంటున్నారు బ‌న్నీ. మ‌రి నిజంగానే బాగున్న సినిమా వ‌చ్చిన‌పుడు అంద‌రూ మూకుమ్మ‌డిగా పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారుగా.. మ‌రి అప్పుడు మాట్లాడ‌రేంటి ఈ హీరోలు అని కొంద‌రు వాళ్ల‌పైనే రివ‌ర్స్ అటాక్ కూడా చేస్తున్నారు.