ఎన్టీఆర్ ఫ్యామిలీ చుట్టాలేన‌ట‌!

Last Updated on by

డ్రామాతో మ‌నిషి క‌నెక్ట్ అయితే సినిమాలో లాజిక్కులు చూడ‌డు! అని ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఆఫీస్‌లో ఒక కొటేష‌న్ ఉంటుంది. మా సినిమా విజ‌యానికి కార‌ణ‌మ‌దే అని అన్నారు మ‌హేష్ కోనేరు. క‌ల్యాణ్ రామ్ హీరోగా గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వ ంలో ఆయ‌న నిర్మించిన 118 ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ కోనేరు హైద‌రాబాద్ లో ముచ్చ‌టించారు.

మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ ..తొలి సినిమా నా నువ్వే కాస్త నిరాశ‌ప‌రిచింది. సొంత‌ ప్రొడ‌క్ష‌న్‌లో చేయ‌క‌పోయినా భాగ‌స్వామిని కాబ‌ట్టి కాస్త బాధ‌ప‌డ్డాను. హీరో న‌మ్మి చేశారు. కానీ అది వ‌ర్కవుట్ కానందుకు బాధ క‌లిగింది. అది ఆడ‌లేద‌న్న బాధ‌తో క‌సిగా చేసిన సినిమా 118. నా నువ్వే స‌మ‌యంలో కెవి గుహ‌న్ క‌థ విన్నాను. చాలా బాగా న‌చ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో చేద్దామ‌ని క‌ల్యాణ్ గారు ఫిక్స‌య్యారు. నా బ్యాన‌ర్‌లో నేను సోలో నిర్మాత‌గా చేయ‌డానికి ఇది క‌రెక్ట్ స్క్రిప్ట్ అనిపించి, నేనే ఆయ‌న్ని రిక్వెస్ట్ చేసి మా బ్యాన‌ర్‌లో చేశాం. నా పుస్త‌క‌ప‌ఠ‌నం కొన్ని స‌న్నివేశాల‌కు సాయ‌మైంది. 118 విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నాను అన్నారు.

కాస్త ఆల‌స్య ం
గ‌తేడాది ద‌స‌రాకు 118 చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకున్నాం. కానీ పెద్దాయ‌న ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో హ‌రికృష్ణ‌ పాత్ర‌ను క‌ల్యాణ్‌రామ్‌ చేయాల్సి వ‌చ్చింది. అది పెద్ద సినిమా కావ‌డంతో క‌ల్యాణ్‌ డేట్లు వాళ్ల‌కు ఇవ్వాల్సి వ‌చ్చింది. మా చిత్రంలో ఆయ‌న‌కు గ‌డ్డం, మీసాలు ఉంటాయి. కానీ అందులో క్లీన్ షేవ్ ఉంటుంది.రెండిటికి మ‌ధ్య ఆల‌స్య మైంది. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్‌లో అనుకున్నా కుద‌ర‌లేదు. ఇప్ప‌టికి రిలీజ్ చేశాం.

ఆ కుటుంబంతో సాన్నిహిత్య ం
నంద‌మూరి హీరోలు, ఆ కుటుంబం మీద అభిమానం ఉంది. నేనేం చేయాల‌నుకున్నా ఎన్టీఆర్‌కి చెబుతాను. ఆయ‌న విని స‌ల‌హా ఇస్తారు. 118 చూసి ఆయ‌న ఎంతో ధైర్యంగా ముందుకెళ్ల‌మ‌న్నారు. దిల్‌రాజు- శిరీష్‌ విడుద‌ల‌కు ఎంత‌గానో స‌హ‌క‌రించారు. వారి అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు.. అని తెలిపారు. కీర్తి సురేష్ తో ఓ సినిమా చేస్తున్నాం. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వ ంలోనూ చేస్తామ‌ని తెలిపారు.

User Comments