మెట్రోలో తార‌క్ భారీ ఫైట్‌?

Last Updated on by

మెట్రో న‌గ‌రాల్లో సినిమాల షూటింగుల‌కు అనుమ‌తులు కోసం భారీగానే చెల్లించాల్సి వ‌స్తోంది. భారీ యాక్ష‌న్ దృశ్యాలు, కీల‌క‌మైన సీన్స్ షూట్ చేయాలంటే ర‌ద్దీగా ఉండే రైల్వే స్టేష‌న్లు, బ‌స్ స్టాప్‌లు, ఫ్లై ఓవ‌ర్లు వంటివి బుక్ చేయాలంటే అందుకు త‌గ్గ‌ట్టే నిర్మాత‌ల‌కు లొకేష‌న్ ప‌ర్మిష‌న్ల రూపంలో భారీగానే ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోందిట‌.

అందుకు ఇదిగో ఇదే తాజా ఉదాహ‌ర‌ణ‌. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `అర‌వింద స‌మేత‌` కోసం మ‌ల‌క్‌పేట్(హైద‌రాబాద్‌) మెట్రో రైల్వే స్టేష‌న్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఇందుకోసం ఏకంగా 40ల‌క్ష‌లు పైగా లొకేష‌న్ ప‌ర్మిష‌న్‌కే ఖ‌ర్చ‌యింద‌ని చెబుతున్నారు. ర‌న్నింగ్ ట్రైన్‌లో చిత్రీక‌ర‌ణ‌కు ఇక్క‌డ ఆస్కారం లేదు కానీ, స్టేష‌న్‌లో స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంది. ఇంత‌వ‌ర‌కూ మెట్రో స్టేష‌న్ సీన్స్‌ అంటే మహేష్‌, అఖిల్ సినిమాల్లో చూశాం. ఇప్పుడు తార‌క్ సినిమాలోనూ అభిమానులు చూడ‌బోతున్నార‌న్న‌మాట‌! హైద‌రాబాద్ షెడ్యూల్ త‌ర్వాత వ‌చ్చే నెల‌లో యూర‌ప్‌లో ఓ రెండు పాట‌ల్ని చిత్రీక‌రించేందుకు యూనిట్ ప్రిపేర‌వుతోంద‌ని తెలుస్తోంది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్‌లో సినిమా రిలీజ్ కానుంది.

User Comments