సోద‌రికి ఓటేయ‌మ‌ని అడ‌గ‌ని వాడు!

Last Updated on by

యంగ్ య‌మ ఎన్టీఆర్ ఓటేశాడు. అంతేకాదు ఓటేయ‌మ‌ని అంద‌రినీ అడిగాడు. కానీ కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తున్న సోద‌రి సుహాసినికి ఓటేయ‌మ‌ని మాత్రం ప్ర‌జ‌ల్ని అడ‌గ‌లేదు. అలాంటిది అంద‌రినీ ఓటేయాల్సిందిగా కోర‌డం విడ్డూరంగా ఉందంటూ ప్ర‌స్తుతం జ‌నాల్లో చ‌ర్చ‌కొచ్చింది.

“స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో ప‌విత్ర‌మైన‌ది. నాన్న‌గారు స్వ‌ర్గీయ నంద‌మూరి హ‌రికృష్ణ సేవ‌లందించిన తేదేపా త‌ర‌పున ఇప్పుడు మా సోద‌రి సుహాసిని కూక‌ట్‌ప‌ల్లి నుంచి పోటీ చేస్తోంది.
స్త్రీలు స‌మాజంలో ఉన్న‌త‌మైన పాత్ర పోషించాల‌ని న‌మ్మే కుటుంబం మాది. ప్ర‌జాసేవ‌కు సిద్ధ‌ప‌డుతున్న మా సోద‌రి సుహాసిని గెల‌వాల‌ని ఆకాంక్షిస్తున్నాను“ అని తాజాగా తార‌క్ ట్వీట్ చేశారు. అయితే త‌న సోద‌రికి ఓటేయ‌మ‌ని పోలింగ్‌కి ముందు అడ‌గ‌ని ఎన్టీఆర్ ఇప్పుడిలా ట్వీట్ చేయ‌డం వ‌ల్ల ఏం ఉప‌యోగం?  అంటూ ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు కొంద‌రు. ఇంత‌కీ తార‌క్ అభిమానులు సుహాసినిని గెలిపించేందుకు ఓటేశారా లేదా? అన్న‌ది ఈనెల 11న తేల్తుంది. అంత‌వర‌కూ వేచి చూడాల్సిందే.

User Comments