ఎన్టీఆర్ కావాలనే చేశాడా..?

Last Updated on by

నంద‌మూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయ‌ని.. బాల‌య్య‌, హ‌రికృష్ణ‌ ఫ్యామిలీస్ మ‌ధ్య ఇప్పుడు దూరం బాగా పెరిగిపోయింద‌ని ఎప్ప‌ట్నుంచో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే దీనిపై ఎప్పుడూ ఎవ‌రూ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం కూడా చేయ‌ట్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ప‌నులు చూసుకుంటున్నారే గానీ అవును.. అంతా క‌లిసే ఉన్నాం అని మెగా హీరోలు చెప్పిన‌ట్లు చెప్ప‌ట్లేదు. ఇక ఇప్పుడు బాల‌య్య‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య దూరం ఎంత‌గా పెరిగి పోయింద‌నేది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. జూన్ 10న బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. ఇండ‌స్ట్రీ అంతా ఈయ‌న‌కు జ‌న్మదిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఒక్క ఎన్టీఆర్ త‌ప్ప‌.

అవును.. బాబాయ్ ని క‌నీసం విష్ చేయ‌లేదు ఎన్టీఆర్. మ‌రిచిపోయాడేమో అనుకోడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజంతా బాల‌య్య నామ జ‌పంతోనే గ‌డిచిపోతుంది కాబ‌ట్టి మ‌రిచిపోయాడు అని చెప్ప‌డానికి లేదు. కావాల‌నే బాల‌య్య‌ను ఎన్టీఆర్ ప‌ట్టించుకోలేద‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. అంటే దూరం బాగానే పెరిగిపోయింద‌నే విష‌యం కూడా ఇక్క‌డ అర్థ‌మ‌వుతుంది. పోనీ.. లోలోప‌ల ఏమైనా విష్ చేసాడా అంటే ఆ ఫోటోలు కూడా బైటికి వ‌స్తాయి. అదీ జ‌ర‌గ‌లేదిక్క‌డ‌. మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ మాత్రం హ్యాపీ బ‌ర్త్ డే బాబాయ్ అంటూ ట్విట్ట‌ర్ లో విష్ చేసాడు. కానీ త‌మ్ముడు నుంచి మాత్రం ఎలాంటి స‌మాచారం రాలేదు. మొత్తానికి.. ఈ నంద‌మూరి వార‌సుల మ‌ధ్య దూరం ఇంకెన్నాళ్లు ఇంకెంత దూరం వెళ్తుందో..?

User Comments