సినిమా అంటే ఎన్టీఆర్ కి ప్రాణం

Last Updated on by

ఇప్పుడు ఎన్టీఆర్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. సినిమా సినిమాకు ప్రాణం పెట్టేస్తున్నాడు ఎన్టీఆర్. చూస్తుంటే ఆయ‌న నెంబ‌ర్ వ‌న్ పీఠం వైపు అడుగేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అందుకే ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే వ‌ర‌స‌గా నాలుగు సినిమాలు ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చూపించాయి. ఇప్పుడు మ‌రింత మార్కెట్ పెంచుకోడానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. ఈయ‌న లైన‌ప్ ఇలాగే ఉంది. త్రివిక్ర‌మ్ తో సినిమా ఇంకా ప‌ట్టాలెక్కక ముందే రాజ‌మౌళితో సినిమాకు క‌మిట‌య్యాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల‌తో ఎన్టీఆర్ రేంజ్ 100 కోట్ల‌కు చేర‌డం ఖాయం. ఫ్యూచ‌ర్ కు త‌గ్గ‌ట్లే ఇప్పుడు చెమ‌ట చిందిస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈయ‌న కొత్త లుక్ ఇప్పుడు అభిమానుల్లో ఎక్క‌డ లేని జోష్ ను తీసుకొస్తుంది. సిక్స్ ప్యాక్ తో పిచ్చెక్కిస్తున్నాడు నంద‌మూరి చిన్నోడు.

ఇప్పుడు సినిమా కోసం త‌న‌ను తాను చాలా మార్చుకుంటున్నాడు ఎన్టీఆర్. ద‌ర్శ‌కుడు చెప్పాడ‌నో లేదంటే తానే నిజంగా మారిపోవాల‌ని అనుకున్నాడో తెలియ‌దు కానీ ఇప్పుడు జూనియ‌ర్ కొత్త లుక్ మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. ఈ చిత్రం కోసం కొన్ని నెల‌లుగా ఫుల్ డైట్ లో ఉన్నాడు ఈ హీరో. ఫుడ్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. దీనికోస‌మే ప్ర‌త్యేకంగా ఓ ట్రైనర్ ను కూడా పెట్టుకున్నాడు. ఇష్ట‌మైన ఫుడ్ ను పూర్తిగా త్యాగం చేసాడు. డైట్ లో భాగంగా తాను తినే ఆహారంలో ఎగ్ వైట్స్, చికెన్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నాడు. స్నాక్స్ రూపంలో ఆల్మండ్స్.. వాల్నట్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. రోస్టెడ్ చికెన్, ఫ్రైడ్ మటన్, ఫిష్ ను రెండు పూట‌ల తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. ఇదంతా ప్రముఖ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్ ఆధ్వర్యంలో జ‌రుగుతుంది.

సినిమా సినిమాకు ద‌ర్శ‌కుల‌కు కావాల్సిన‌ట్లుగా మారుతున్నాడు ఎన్టీఆర్. టెంప‌ర్ నుంచి లుక్స్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఎన్టీఆర్. టెంప‌ర్ లో కొత్త‌గా క‌నిపించాడు.. ఆ త‌ర్వాత నాన్న‌కు ప్రేమ‌తోలో మ‌రింత కొత్త‌గా మారిపోయాడు. జ‌న‌తా గ్యారేజ్, జై ల‌వ‌కుశ‌ల్లోను ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ కాదు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కోసం పూర్తిగా వేష‌మే మార్చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్మీ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. దాంతో ఈ పాత్ర కోసం ఫుల్ డైట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో క‌నిపించ‌నంత ఫ్రెష్ లుక్ ఇందులో ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే చాలా మారిపోయాడు ఎన్టీఆర్.

కెరీర్ కొత్త‌లో సున్నండ‌లా ఉండేవాడు ఎన్టీఆర్. త‌ర్వాత ఆ రూపం మ‌రింత పెరిగిపోయింది. రాఖీ టైమ్ కు చూడ‌లేని విధంగా మారిపోయాడు ఎన్టీఆర్. కానీ త‌ర్వాత య‌మ‌దొంగ కోసం కొత్త లుక్ లోకి వెళ్లి షాక్ ఇచ్చాడు. అప్ప‌ట్నుంచీ మ‌రీ లావు కాకుండా జాగ్ర‌త్త‌పడినా.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఊస‌ర‌వెల్లి, జ‌న‌తా గ్యారేజ్ లో ఒళ్లు చేసిన‌ట్లు క‌నిపించాడు ఎన్టీఆర్. కానీ పాత రూపంలోకి మాత్రం వెళ్ల‌లేదు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ కోసం మ‌రోసారి కొత్త‌గా మారిపోయాడు ఎన్టీఆర్. దాంతోపాటు రాజ‌మౌళి సినిమా కోసం కూడా చాలా మార‌నున్నాడు ఎన్టీఆర్. ఇందులో చ‌ర‌ణ్ కూడా మ‌రో హీరోగా న‌టించ‌నున్నాడు. ఈ మ‌ధ్యే అమెరికా వెళ్లిన ఈ ఇద్ద‌రు హీరోలు.. ఇప్పుడు తిరిగి వ‌చ్చేసారు. మొత్తానికి ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ కి ఖుషీ ఖుషీ చేస్తుంది.

User Comments