ఎన్టీఆర్ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

Last Updated on by

అదేంటి.. అర‌వింద స‌మేత లుక్ మొన్నే క‌దా విడుద‌లైంది. అప్పుడే త్రివిక్ర‌మ్ మ‌రో లుక్ విడుద‌ల చేసాడా.. అబ్బా ఎంత ఫాస్ట్ అనుకుంటున్నారా.. అయితే ఇప్పుడు విడుద‌లైంది ఎన్టీఆర్ సినిమా లుక్కే కానీ త్రివిక్ర‌మ్ కాదు. అదెలా అనుకుంటున్నారా..? ఇప్పుడు మ‌న హీరోల‌కు తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాల ఇండ‌స్ట్రీల్లోనూ మంచి ఫాలోయింగ్ వ‌చ్చేసింది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు హీరోలు.

ntr jai lava kusa malayalam first look posters released
జ‌న‌తా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కు మ‌ళ‌యాలంలో కూడా మార్కెట్ ఓపెన్ అయింది. దాంతో ఇప్పుడు జై ల‌వ‌కుశ‌ను అక్క‌డ విడుద‌ల చేస్తున్నారు. రావ‌ణాసురం పేరుతో జై ల‌వ‌కుశ కేర‌ళ‌లో విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. బాబీ తెర‌కెక్కించిన ఈ చిత్రం క‌ళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఇప్పుడు మ‌ళ‌యాల వ‌ర్ష‌న్ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అక్క‌డ టైమ్ చూసుకుని విడుద‌ల చేయ‌బోతున్నారు అక్క‌డి బ‌య్య‌ర్లు. ఖచ్చితంగా జై ల‌వ‌కుశ కేర‌ళ‌లో బాగానే ప‌ర్ఫార్మ్ చేసేలా క‌నిపిస్తుంది. దానికి కార‌ణం జ‌న‌తా గ్యారేజ్ తో వ‌చ్చిన మార్కెట్.

ntr jai lava kusa malayalam first look posters released

User Comments