ఎన్టీఆర్ ‘జై లవ కుశ’.. రావట్లేదా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస హిట్ సినిమాలతో మంచి ఊపుమీద ఉన్న విషయం తెలిసిందే. ఈ ఊపులో త్రిపాత్రాభినయం కలిగిన ‘జై లవ కుశ’ లాంటి సినిమాకు ఎన్టీఆర్ సైన్ చేయడంతో.. ఆది లోనే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇక ఫస్ట్ టీజర్ పేరు చెప్పి జై అనే నెగిటివ్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఎన్టీఆర్ విలనిజంతో కూడిన నట విశ్వరూపం చూపించడంతో.. మాస్ జనాలు ఆల్రెడీ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక ఫ్యాన్స్ అయితే దసరా ఎప్పుడొస్తుందా.. సినిమా ఎప్పుడు చూస్తామా అన్నట్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో దసరా కానుకగా సెప్టెంబర్ 21 రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆ డేట్ కు రావడం అనుమానమే అన్నట్లు ఇన్నర్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తుండటం షాక్ ఇస్తోంది. ఇదిలా ఉంటే, అనుకున్న ప్రకారం జై లవ కుశ షూటింగ్ ఈ నెలాఖరుకు పూర్తయిపోవాలట. దాంతో సెప్టెంబర్ 21న రిలీజ్ కు అన్ని విధాలా బాగుంటుందని లెక్కలు వేసుకున్నారట. కానీ, ఇప్పుడు ఈ సినిమా ఈ నెలాఖరుకు పూర్తయ్యేలా లేదని.. వర్క్ చాలా పెండింగ్ లో ఉందని టాక్ బయటకు రావడం గమనార్హం. ముఖ్యంగా డైరెక్టర్ బాబీ అండ్ టీమ్ ఎంత కష్టపడుతున్నా కూడా ఈ సినిమా సెప్టెంబర్ రెండో వారానికి గాని పూర్తి కాకపోవచ్చని చెబుతుండటం ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.
దీంతో సెప్టెంబర్ 21న సినిమా రావడం కష్టమేనని కొందరు ఫిక్స్ అయిపోతున్నారు. మరోవైపు, సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా ఇప్పటికే సెప్టెంబర్ 27వ తేదీకి కర్చీఫ్ వేసుకుని కూర్చోవడంతో.. ఎన్టీఆర్ జై లవ కుశ వస్తే 29న గాని లేదా అక్టోబర్ కు వాయిదా పడటం గాని జరుగుతుందని సినీవర్గాలు కూడా అంచనా వేస్తుండటం బాధ కలిగిస్తోంది. అంతేకాకుండా జై లవ కుశ కొన్నిరోజులకు వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తుండటంతో.. కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు సెప్టెంబర్ 21 కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయని అప్పుడే ప్రచారం జరిగిపోతుండటం విశేషం. మరి ఇదే నిజమై, అనుకున్న టైమ్ కి సినిమా రావట్లేదా అంటే ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కు కూడా షాక్ తగిలినట్లే. మరి ఇది జస్ట్ రూమర్ మాత్రమేనని.. నిర్మాత కళ్యాణ్ రామ్ కొట్టిపారేస్తాడేమో చూడాలి.