అల్లూరి సీతారామ‌రాజు లుక్

Last Updated on by

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌ర్వాత మ‌ళ్లీ అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో ఎవ‌రు అంత బాగా సూట‌వుతారు? ఈ ప్ర‌శ్న‌కు ఇంత‌కాలం స‌మాధానం లేదు. ఇదిగో ఈ లుక్ చూశాక మాత్రం ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌ త‌ర్వాత అంత బాగా బాల‌య్య‌బాబు సూట‌య్యార‌ని చెప్పొచ్చు. కాషాయం ధ‌రించి.. లెద‌ర్ చెప్పులు తొడిగి.. రుద్రాక్ష‌ల్ని చేతికి ధ‌రించి ఆయ‌న రూప‌మే రౌద్రాన్ని ఆవిష్క‌రిస్తోంది. గిరిజ‌నుల అండ‌తో నాడు న‌ర్సీప‌ట్నం ప‌రిస‌రాల్లోని అడ‌వుల్లో అల్లూరి ఇలా సంచ‌రించేవార‌ని చెబుతారు. తెల్లోడి తుపాకుల‌కు ఎదురెళ్లిన మ‌న్యం సింహం అల్లూరి.

తాజా పోస్ట‌ర్ అందుకు సింబాలిక్ గానే ఉంది. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విల్లంబులు అందుకుని అడ‌వుల్లో సంచ‌రించిన తీరును పోస్ట‌ర్ రూపంలో అద్భుతంగా ఆవిష్క‌రించారు. ఇదే గెట‌ప్ య‌న్టీ రామారావు నాటి సినిమాల్లో వేశారు. అభిమానుల్ని అల‌రించారు. య‌న్టీఆర్ చిత్రంలో ప‌దుల సంఖ్య‌లో గెట‌ప్‌లు ఉంటాయి. అందులో ఇది ఒక‌టి. క‌థానాయ‌కుడు చిత్రంలోని ఈ గెట‌ప్ బాల‌య్య‌కు పేరు తెస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఆ రూపం అద్భుతంగా కుదిరింది. ఇక క‌థానాయ‌కుడు సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతోంది. సంక్రాంతి సినిమాల్లో క‌థానాయ‌కుడు సంచ‌ల‌నాలు ఖాయ‌మ‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. తాజాగా రివీల్ చేసిన అల్లూరి లుక్ అభిమానుల సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

User Comments