ఎన్టీఆర్ `క‌థానాయ‌కుడు` లైవ్ రివ్యూ

Last Updated on by

లైవ్  రేటింగ్‌: 3.0/5.0

`క‌థానాయ‌కుడు` ఫ‌స్టాఫ్ ఎన్టీఆర్ సినీజీవితం పై సాగుతుంది. సెకండాఫ్‌లో అత‌డు ప్ర‌జ‌ల‌కు ఎలా చేరువ‌య్యారో చూపించారు. సెకండాఫ్ తో పోలిస్తే ఫ‌స్టాఫ్ కామ‌న్ ఆడియెన్‌కి క‌నెక్ట‌వ్వ‌డం క‌ష్టం. ఓవ‌రాల్‌గా బాల‌య్య, క్రిష్ ఓ మంచి ప్ర‌య‌త్నం చేశార‌నే చెప్పొచ్చు. ఎన్టీఆర్ పాత్ర‌కు బాల‌కృష్ణ న్యాయం చేశారు. క్రిష్ త‌న‌దైన శైలిలో ఒక మంచి క‌థ‌తో ఈ చిత్రాన్ని చ‌క్క‌గా తెరకెక్కించారు. ఎన్టీఆర్ అభిమానులకు, అనుచ‌రుల‌కు ఇదో బిగ్ ట్రీట్ అనే చెప్పొచ్చు. అయితే రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా ఆడియెన్ ఎంత‌వ‌ర‌కూ క‌నెక్ట‌వుతార‌న్న‌దే ప్ర‌శ్నార్థ‌కం. ఈ సినిమా జ‌నాల‌కు ఏ మేర‌కు చేరువైందో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.

5.00 AM: రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించిన ఎన్టీఆర్. క్రిష్ వాయిస్ ఓవ‌ర్‌తో మూవీ ఎండ్.. టైటిల్స్ ప‌డుతున్నాయి.. మోర్ దేన్ ఏ హీరో సాంగ్

4.55 AM: స‌ర్ధార్ పాపారాయుడు కోర్ట్ స‌న్నివేశం శ్రీ‌దేవి(ర‌కుల్‌)తో..

4.45 AM: ఎన్టీఆర్ రాజ‌కీయ పార్టీ ఏర్పాటుపై కేంద్ర‌ప్ర‌భుత్వానికి నివేదిక‌.. ఎన్టీఆర్ పై ఐటీ రెయిడ్స్…

4.40 AM: నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా రంగ ప్ర‌వేశం.. ఆడియెన్‌లో హుషారైన రెస్పాన్స్..

4.35 AM: దాస‌రి నారాయ‌ణ‌రావు గా చంద్ర‌శేఖ‌ర్ సిద్ధార్థ్‌ రంగ ప్ర‌వేశం ..

4.30 AM: ఆకు చాటు పిందె త‌డిసె సాంగ్.. శ్రీ‌దేవిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ…

చ‌క్క‌ని సెంటిమెంట్ సీన్స్ తో సినిమా అద్భుతంగా ర‌న్ అవుతోంది.

4.25 AM: ప్ర‌జ‌ల‌కు క్లోజ్ అయిన ఎన్టీఆర్.. సెంటిమెంట్ స‌న్నివేశాలు చ‌క్క‌గా చూపించారు..

4.20 AM: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ తుఫాన్.. ఎన్టీఆర్, నాగేశ్వ‌ర‌రావు ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మం.. వెండితెర దొర సాంగ్.. ఎన్టీఆర్, నాగేశ్వ‌ర‌రావు మ‌ధ్య స‌త్సంబంధాలు, స్నేహంపై ఫోక‌స్ చేసిన ద‌ర్శ‌కుడు..

4.15 AM: య‌మ‌గోల సినిమా చిత్రీక‌ర‌ణ .. జ‌య‌ప్ర‌ద పాత్ర‌లో హ‌న్సిక ఎంట్రీ.. మ‌రీ అంత లేత హీరోయిన్‌తో ఎందుకు అని ఎన్టీఆర్‌ని ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఆపే ప్ర‌య‌త్నం..

4.05 AM: దాన వీర సూర క‌ర్ణ షూట్ .. సినిమా గొప్ప‌త‌నం ఎలివేష‌న్‌.. శ్రీయ శ‌ర‌ణ్ ఎంట్రీ..

4.00 AM: సినీప‌రిశ్ర‌మ మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్‌కి షిఫ్టింగ్ .. హైద‌రాబాద్‌లో రామ‌కృష్ణ స్టూడియోస్ నిర్మించే ప్లాన్‌లో ఎన్టీఆర్..

3.55 AM: ఎన్టీఆర్‌లో కోపిష్టి కోణం ఎలివేట్ చేసిన ద‌ర్శ‌కుడు… డ్రైవ‌ర్‌గా హ‌రికృష్ణ ఎంట్రీ..

3.50 AM: ద్వితీయార్థం ప్రారంభం.. ఎన్టీఆర్, నాగేశ్వ‌ర‌రావు ఇద్ద‌రికీ ప‌ద్మ‌శ్రీ‌లు. పుర‌స్కారాలు అందుకునేందుకు డిల్లీ వెళ్లి పి.వి.న‌ర‌సింహారావును క‌లిశారు..

క‌థ‌నం ఆస‌క్తిగా ర‌న్ చేసినా ఫ‌స్టాఫ్ కాస్త నెమ్మ‌దిగానే సాగుతుంది.. లార్డ్ కృష్ణ స‌న్నివేశం, రామ‌కృష్ణ మ‌ర‌ణం స‌న్నివేశాలు హైలైట్. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమాల‌తో ఎన్టీఆర్ జర్నీ చూపించారు.. ఇక‌పై ఏం చూపిస్తారో వేచి చూడాలి..

3.40 AM: కొడుకు పోయిన బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అన్నిర‌కాల పాత్ర‌ల్ని అంగీక‌రించిన ఎన్టీఆర్.. ఫస్టాఫ్ పూర్త‌యింది..

3.35 AM: సెంటిమెంట్ ట‌చ్ తో క‌థ‌పై గ్రిప్ పెంచిన ద‌ర్శ‌కుడు.. క‌థ‌లో మేలిమి మ‌లుపులు..

3.30 AM: కుమారుడు రామ‌కృష్ణ మ‌ర‌ణం.. అది తెలిసీ ఆన్ లొకేష‌న్ షూటింగ్ వ‌దిలేయ‌కుండా కొన‌సాగించిన ఎన్టీఆర్ వృత్తి నిబ‌ద్ధ‌త‌…

3.25 AM: రేలంగి పాత్ర‌లో బ్ర‌హ్మానందం, కృష్ణ‌కుమారి పాత్ర‌లో ప్ర‌ణీత ఎంట్రీ..

3.20 AM: నాగేశ్వ‌ర‌రావు (సుమంత్) – ఎన్టీఆర్ హీరోలుగా గుండ‌మ్మ క‌థ చిత్రీక‌ర‌ణ‌.. సావిత్రిగా నిత్యామీన‌న్ ఎంట్రీ

3.15 AM: బాల‌కృష్ణ నామ‌క‌ర‌ణం స‌న్నివేశం.. థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లేలా విజిల్స్.. గగ్గోలు..

3.10 AM : కె.వి.రెడ్డి (క్రిష్) రిజెక్ట్ చేసిన త‌ర్వాత త‌న సినిమాకి త‌నే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఎన్టీఆర్.. రావ‌ణుడిగా ఎలివేష‌న్..

3.05 AM: ఎన్టీఆర్ కృష్ణ భ‌గ‌వానుని అవ‌తారం.. సీన్ అద్భుతంగా ఎలివేట్ అయ్యింది..

మూవీ నెమ్మ‌దిగా సాగుతోంది.. అయితే క‌థ మిస్సవ్వ‌కుండా ఆస‌క్తిగా సాగుతోంది…

3.00 AM: నేష‌న‌ల్ ఆర్ట్స్ థియేట‌ర్ పేరుతో సొంత బ్యాన‌ర్ ప్రారంభించిన ఎన్టీఆర్.. సొంతంగా సినిమాల నిర్మాణం..

2.55 AM: ఎన్టీఆర్ ధాతృహృద‌యాన్ని ఎలివేట్ చేసే సీన్.. పాట‌కు వేళాయె.. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ సాంగ్..

2.50 AM: `తోట రాముడు` రిలీజైంది.. తొలి స‌క్సెస్ ద‌క్కింది. అటుపై మద్రాసుకు కుటుంబం అంతా ప‌య‌నం..

2.45 AM: నాగిరెడ్డి (ప్ర‌కాష్‌రాజ్), ఆలూరి చ‌క్ర‌పాణి (ముర‌ళి శ‌ర్మ‌), కె.వి.రెడ్డి (క్రిష్‌), నాగేశ్వ‌ర‌రావ్ (సుమంత్‌) పాత్ర‌ల రంగ ప్ర‌వేశం..

2.40AM: సినీప‌రిశ్ర‌మ‌లో ఎన్టీఆర్ కు ఇబ్బందులు.. మ‌ద్రాస్ నుంచి ఇంటికి తిరుగుప‌య‌నం.. నిర్మాత దొర‌క‌డం అంత సులువుగా లేదు.. చివ‌రి నిమిషంలో ఓ ఛాన్స్ ద‌క్కింది..

2.35 AM: హెచ్‌.ఎం.రెడ్డి పాత్ర‌లో కైకాల స‌త్య‌నారాయ‌ణ ఎంట్రీ

2.30AM: ఎన్టీఆర్.. ఎల్వీ ప్ర‌సాద్ ని క‌లిశారు. అత‌డు తెర‌కెక్కిస్తున్న చిత్రంలో ఒక చిన్న పాత్ర‌లో అవ‌కాశం అందుకున్నారు..

2.25 AM: క‌థానాయ‌కుడు టైటిల్ పాట‌కు వేళాయెను.. తొలి పాట టైటిల్స్ ప‌డుతుండ‌గా… హీరోగారి గోల్డెన్ ఎరా ఆవిష్క‌ర‌ణ‌..

2.20 AM: ఎన్టీఆర్ కుటుంబాన్ని వ‌దిలి చెన్న‌య్ కు ప‌య‌నం.. సినిమాల్లో నటించేందుకు..

2.15 AM: ఎన్టీఆర్ ప్ర‌భుత్వ అధికారిగా.. అవినీతి న‌చ్చ‌క ఉద్యోగానికి రాజీనామా

2.10 AM: ఆస్ప‌త్రిలో ఎన్టీఆర్ .. బ‌స‌వ‌తార‌కం పాత్ర‌ధారి విద్యాబాల‌న్ ప్ర‌వేశం… క‌థ 1947 బెజ‌వాడ‌కు షిప్ట్‌..

2.05 AM: క‌థ మ‌ద్రాస్‌లో మొద‌లైంది. 1984 లో హ‌రికృష్ణ (క‌ళ్యాణ్ రామ్) ఎంట్రీ సీన్..

2.00 AM: బాల‌కృష్ణ వాయిస్ ఓవ‌ర్‌తో సినిమా మొద‌లైంది.


Related Posts