ఎన్టీఆర్ అతిధిగా క‌ళ్యాణ్‌రామ్‌16

Last Updated on by

కెరీర్ ప‌రంగా రెట్టించిన ఉత్సాహంలో ఉన్నాడు క‌ళ్యాణ్‌రామ్‌. ఓవైపు నిర్మాత‌గా, మ‌రోవైపు హీరోగా వ‌రుస విజయాల‌తో దూకుడుమీదున్నాడు. సినిమా వెంట సినిమా నిర్మిస్తూ, సినిమా వెంట సినిమాలో న‌టిస్తూ ఎంతో హుషారుగా ఉన్నాడు. ఆ హుషారు, ఉత్సాహం వెన‌క త‌మ్ముడు తార‌క‌రాముని అండాదండా ఉన్న సంగ‌తి విధిత‌మే. ఇటీవ‌లే ఎంఎల్ఏ చిత్రంతో విజ‌యం అందుకున్న క‌ళ్యాణ్‌రామ్ త‌దుప‌రి, `నానువ్వే` చిత్రంతో ప్రేక్ష‌కాభిమానుల ముందుకు రానున్నాడు. ఇక లుక్ ప‌రంగానూ క‌ళ్యాణ్‌రామ్‌లోని మేకోవ‌ర్ ఇటీవ‌లి కాలంలో ట్రెండ్ సెట్ చేస్తోంది.

తాజాగా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్ 16వ సినిమా అధికారికంగా ప్రారంభ‌మైంది. నేటి వేకువ ఝాము 5గంట‌ల నుంచి హైద‌రాబాద్ -రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాలు సాగాయి. ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా NKR16 లాంఛ‌నంగా ప్రారంభంమైంది. దేవుని చిత్ర ప‌టాల‌పై ఎన్టీఆర్ క్లాప్ కొట్ట‌గా గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా మొద‌లైంది. కార్య‌క్ర‌మంలో నంద‌మూరి హ‌రికృష్ణ‌, నంద‌మూరి రామ‌కృష్ణ‌, చిత్ర ద‌ర్శ‌కుడు గుహ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు. నివేధ థామ‌స్‌, `అర్జున్‌రెడ్డి` ఫేం షాలిని పాండే నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప‌లువురు సీనియ‌ర్‌న‌టీన‌టులు న‌టించ‌నున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

User Comments