షాక్.. జైలవకుశ లో చిరు రౌడీ అల్లుడు సీన్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవ కుశ దసరా కానుకగా ఈ నెల 21న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రిలీజైన టీజర్లు, ప్రోమోలు, ట్రైలర్ కూడా సినిమాపై మంచి అంచనాలనే నెలకొల్పాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తొలిసారిగా ఈ సినిమాతో త్రిపాత్రాభినయం చేస్తుండటం..

అలాగే విలనిజంతో కూడిన జై పాత్ర కూడా ఓ రేంజ్ లో రచ్చ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

కానీ, రిలీజ్ ముంగిట నెట్ ఇంట్లో మాత్రం ఈ సినిమా రిజల్ట్ పై అప్పుడే నెగిటివ్ ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

దానికి తగ్గట్లు సినిమా కూడా అక్కడక్కడా పాత సినిమా రిఫరెన్స్ తో తీసినట్లు కనిపిస్తుండటం..

జై పాత్ర తప్ప లవ కుశ పాత్రలు రొటీన్ గానే ఉండటం విమర్శలకు పని దొరికినట్లు అయింది.

ఇక ఇప్పుడేమో తాజాగా రిలీజైన జై లవ కుశ ట్రైలర్ లో చూపించిన ఓ సీన్..

ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గత సినిమా ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని ఓ సీన్ ను యాజిటీజ్ గా పోలి ఉందని న్యూస్ బయటకు రావడం హాట్ టాపిక్ అయిపోయింది.

ఆ స్టోరీలోకి వెళితే, చిరు డ్యూయల్ రోల్ చేసిన రౌడీ అల్లుడు సినిమాలో ఆటోజానీ పాత్ర మంచివాడైన కళ్యాణ్ ప్లేస్ లో ఆఫీస్ కు వస్తాడనే విషయం చాలామందికి తెలుసు.

ఇక ఆఫీసుకు వచ్చాక చిరు అక్కడ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

తన స్టైల్లో క్లాస్ లుక్ లో మాస్ డైలాగ్స్ చెప్పడం.. అక్కడ అమ్మాయిల అందాలను చూడటం..

అక్కడున్న అందరినీ తన కామెడీతో ఆడుకోవడం.. ఇలా జరుగుతూ ఉంటుంది హంగామా.

ఇప్పుడు అదే తరహాలో జై లవ కుశ ట్రైలర్ లో లవ పాత్ర ప్లేస్ లోకి బ్యాంక్ ఎంప్లాయ్ గా కుశ ఆఫీసుకు రావడం.. అక్కడ హంసా నందినిని ఓరకంట చూడటం.. ఆఫీస్ లో మిగతా స్టాఫ్ తో రచ్చ రచ్చ చేయడం స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ఈ యవ్వారం ఇప్పుడు నానా రచ్చకు కారణం అవుతుంది.

దానికి తోడు పెరిగిన టెక్నాలజీతో.. చిరు రౌడీ అల్లుడు సినిమాలోని ఆయా సీన్స్ తాలూకూ స్క్రీన్ షాట్లు తీసి, ఇప్పటి జై లవ కుశ లోని ఈ సీన్స్ తాలూకూ స్క్రీన్ షాట్స్ పక్కన పెట్టడంతో నెట్ ఇంట్లో ఇదిప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

ముఖ్యంగా ఫ్యాన్స్ ఈ విషయంలో విమర్శలు చేసే వారితో వాదనకు దిగుతుండటంతో రచ్చ రచ్చ అవుతుందని సమాచారం.

Follow US