`మహానాయకుడు` మూవీ రివ్యూ

Last Updated on by

నటీనటులు : నందమూరి బాలకృష్ణ(ఎన్టీఆర్), విద్యాబాలన్(బసవతారకం), రానా(చంద్రబాబు), కళ్యాణ్ రామ్ (హరికృష్ణ), సచిన్ ఖేద్కర్ (నాదెండ్ల) తదితరులు
బ్యానర్: ఎన్బికె ఫిలింస్- విబ్రీ మీడియా- వారాహి చలనచిత్రం
నిర్మాత: బాలకృష్ణ- సాయి కొర్రపాటి- విష్ణు ఇందూరి
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
రచన- దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

ముందు మాట:
నటసింహా నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర లో నటించిన `ఎన్టీఆర్ – మహానాయకుడు` ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. `కథానాయకుడు`లో పూర్తిగా ఎన్టీఆర్ సినీజీవితాన్ని తెరపై చూపించారు. `మహానాయకుడు`లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపిస్తున్నామని క్రిష్ తెలిపారు. ఆ క్రమంలోనే తొలి భాగం కంటే జనాల్లో ఈ రెండో భాగంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఎన్నో ట్విస్టులు, టర్నులు, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, నాదెండ్ల వెన్నుపోటు వంటి కోణాలు ఆసక్తి ని రేకెత్తించాయి. అయితే సినిమాలో అంత మ్యాటర్ ఉందా? లేదా? అసలు ఎమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్లే సన్నివేశాలు ఉన్నాయా లేదా? ఇందులో చంద్రబాబు హీరోనా? విలనా? నాదెండ్ల పాత్రను ఎలా చూపించారు? అన్నది తెరపైనే చూడాలి.

కథనం అనాలిసిస్:
తెలుగు దేశం పార్టీ ఆరంభం.. అనంతరం గమనం ఎలా సాగింది? పార్టీ కోసం ఎన్టీఆర్ ఏం చేశారు? ఆ పార్టీ సంచలన విజయం సాధించి ఎన్టీఆర్ సీఎం అయ్యే వరకూ సినిమా ఇది. నాదెండ్ల వెన్నుపోటు తర్వాత కంబ్యాక్ అయిన తీరు తదితర అంశాలతో తెరకెక్కిన ఒక క్లీన్ బయోపిక్ ఇది. తారకరామునికి ప్రజాబలం ఎలా కాపాడిందో చూపించారు. రామన్న కథ పాటతో ప్రారంభించి ఇంటర్వెల్ వరకూ ఉత్కంఠగా నడిపి అటుపై ఫ్లాటుగా మారడం అన్నది ప్రేక్షకునికి ఓ పరీక్షలా మారుతుంది. అయితే ఇంటర్వెల్వ వరకూ ఒకే రకమైన టెంపోలో చూపించడంలో క్రిష్ సక్సెసయ్యారు. ముఖ్యంగా నందమూరి అభిమానులకు ఇదో విజువల్ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయ్యాక సినిమా పేస్ కొంత డ్రాప్ అయ్యింది. సెంటిమెంట్ సన్నివేశాలతో హీరోయిజానికి మరీ అంత ఆస్కారం కనిపించలేదు. ఇంటర్వెల్ కి ముందు నాదెండ్ల భాస్కరరావ్ వెన్నుపోటు ట్విస్టు ఆకట్టుకుంది.

ద్వితీయార్థంలో మహానాయకుడు కథనం ఫ్లాట్ గా ఎలాంటి మలుపులు లేకుండా సాగుతుంది. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఉత్కంఠను పెంచినా కానీ.. ఎన్టీఆర్ పాత్రను చూపించిన వైనం అభిమానులకు నచ్చినట్టుగా, కామన్ ఆడియెన్ కి నచ్చే అవకాశమే లేదు. ఇది కేవలం అభిమానులకు పెద్దాయన జీవితాన్ని తెరపై చూసుకున్నామన్న సంతోషం కలిగించేందుకు మాత్రమేనని అర్థమవుతుంది. కామన్ ఆడియెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కి ఏమాత్రం ఆస్కారం కనిపించలేదు. సినిమాటిక్ లిబర్టీ అన్నది ఎక్కడా ఉపయోగించకుండా ఒక కథను కథగా మాత్రమే దర్శకుడు చెప్పేందుకు ప్రయత్నించారు.

నటీనటులు:
ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ పెర్ఫెక్ట్ గా నటించారు. తన వయసు ఆ పాత్రకు పెర్ఫెక్ట్ గా సూటైంది. బాలయ్య నటన నందమూరి ఫ్యాన్స్ కి గొప్ప ట్రీట్ అనడంలో సందేహం లేదు. ఇక బసవతారకం పాత్రలో విద్యాబాలన్ అద్భుతంగా నటించారు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన ఎక్స్ట్రార్డినరీ. చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటన ఆకట్టుకుంది. నాదెండ్ల భాస్కర్ రావ్ పాత్రలో సచిన్ ఖేద్కర్ అద్భుతంగా సూటయ్యారు. అయితే అతడి పాత్రను వివాదాలకు తావివ్వకుండా కుదించేయడం పెద్ద మైనస్. హరికృష్ణ (కళ్యాణ్ రామ్) పాత్ర ప్రాధాన్యతను ఎక్కువ చూపించలేదు. ఆ పాత్ర పరిమితం. భరత్, వెన్నెల కిషోర్, పృథ్వీ, సమీర్ పాత్రలు ఓకే.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా అత్యున్నత చిత్రమిది. ఎన్టీఆర్ జీవితంపై క్రిష్ గొప్ప పరిశోధన చేశారు. అయితే సినిమాలో గ్రాఫ్ పెంచేందుకు ఉపయోగించాల్సిన టెక్నిక్ విషయంలో క్రిష్ తడబడ్డారని ఫ్లాట్ గా సాగే నేరేషన్ చెబుతుంది. దానివల్ల ప్రేక్షకుడిని కుర్చీ అంచుపై కూచోబెట్టడంలో వైఫల్యం కనిపిస్తుంది. కీరవాణి సంగీతం, రీరికార్డింగ్ ప్లస్. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం అద్భుతం. సాయిమాధవ్ డైలాగులు సినిమాకి పెద్ద అస్సెట్. ఎడిటింగ్, ప్రొడక్షన్ విలువలు ఆకట్టుకుంటాయి.

ప్లస్ పాయింట్స్:
*ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటన
*డైలాగ్స్

మైనస్ పాయింట్స్:
* ద్వితీయార్థంలో జీరో హీరోయిజం..
*కథ ఫ్లాట్ గా సాగడం..
* క్యూరియాసిటీ పెంచే మలుపులు సున్నా

ముగింపు:
టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ కి మాత్రమే..

రేటింగ్:
2.75/5

User Comments