ప్రొడ్యూసర్ గ మహేష్ విఫలం

Last Updated on by

తెలుగు ఇండస్ట్రీలో కొందర్ని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. వాళ్లు సినిమాలకు పిఆర్ చేసినపుడు.. మేనేజర్లుగా ఉన్నపుడు అదరగొడుతున్నారు. కానీ వాళ్లే నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నపుడు మాత్రం కథను జడ్జ్ చేయడంలో విఫలం అవుతున్నారు.. ఎవరో తీసిన సినిమాను ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లడానికి వాళ్ల పిఆర్ బుర్రను బాగా వాడుతున్నారు కొందరు. అందులో మహేశ్ కోనేరు.. సురేష్ కొండేటి లాంటి వాళ్లున్నారు. కానీ వాళ్లే నిర్మాతలుగా మారి సినిమాలు చేసినపుడు మాత్రం విజయం అందుకోలేకపోతున్నారు. ఈ మధ్యే మహేశ్ కోనేరు నిర్మాతగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పై కళ్యాణ్ రాం హీరోగా నా నువ్వే సినిమా చేసాడు. ఇది డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు కళ్యాణ్ తోనే సినిమాటోగ్రఫర్ కేవీ గుహన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మరో సినిమా నిర్మిస్తున్నాడు.

ఇక సురేష్ కొండేటి కూడా నిర్మాతగా విఫలం అవుతున్నాడు. అప్పట్లో ప్రేమిస్తే లాంటి సినిమాను తెలుగు వాళ్లకు అందించిన ఈ పిఆర్ కమ్ నిర్మాత ఇప్పుడు శంభో శంకరతో వచ్చాడు. ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోయే పరాజయాన్ని మూటగట్టుకుంది. యుఎస్ లో అయితే మాటలకు కూడా అందని ఫ్లాప్ ను అందుకుంది ఈ చిత్రం. అక్కడ సొంతంగా బయ్యర్లు విడుదల చేస్తే చూడ్డానికి కేవలం 8 మంది ప్రేక్షకులు మాత్రమే థియేటర్ కు వచ్చారు. దీన్నిబట్టే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మారుతి స్నేహితుడు.. మరో పిఆర్ ఎస్ కే ఎన్ కూడా ఇప్పుడు ట్యాక్సీవాలా సినిమాతో నిర్మాతగా మారాడు. రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా విడుదలకు తంటాలు పడుతుంది. మరి ఈయన అయినా నిర్మాతగా సక్సెస్ అవుతాడో లేదో..?

User Comments