ఎన్టీఆర్ మేనేజ‌ర్ సీక్రెట్ ఇవీ

Last Updated on by

టాలీవుడ్‌లో నంబ‌ర్-1 క‌మెడియ‌న్ ఎవ‌రు? అంటే ఈ ప్ర‌శ్న‌కు స‌రైన స‌మాధాన‌మే లేదు. ఒక్క వెన్నెల కిషోర్ మిన‌హా స‌రైన క‌మెడియ‌న్లు ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్లు ఎంత‌గా పాపురైనా, వేగంగా హీరోలు అయిపోవ‌డంతో వీళ్ల‌ను ఎవ‌రూ క‌మెడియ‌న్లుగా గుర్తించ‌డం లేదు. ఇలాంటి స‌న్నివేశంలో ఒకే ఒక్క దేవుడులా ఆదుకుంటున్నాడు వెన్నెల కిషోర్. కెరీర్ ప‌రంగా అతడి లైన‌ప్ గ‌త కొన్నేళ్లుగా అస్స‌లు ఏమాత్రం త‌క్కువ‌గా లేదు. అంద‌రు స్టార్ హీరోల‌కు ఆప్ష‌న్ ఒక్క‌డే అన్న చందంగా వెన్నెల కిషోర్ కెరీర్ వెలిగిపోతోంది.

ఇప్ప‌టికిప్పుడు భార‌తీయుడు 2, ఎన్టీఆర్ బ‌యోపిక్, సైరా, యాత్ర‌.. ఇలా అన్నీ టాప్ సినిమాల్లో వెన్నెల కిషోర్ న‌టిస్తున్నాడు. మ‌రోవైపు బ్ర‌హ్మీ, అలీ, వేణుమాధ‌వ్, సునీల్ అంతా జీరో అయిపోయారు.. ప్ర‌స్తుతం టాలీవుడ్‌కి క‌మెడియ‌న్ల కొర‌త వేధిస్తోంది. ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న `క‌థానాయ‌కుడు` చిత్రంలో వెన్నెల కిషోర్ ఎన్టీఆర్ మేనేజ‌ర్ రుక్మానంద‌రావు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్ర‌ధారి బాల‌కృష్ణ పాత్ర ఆద్యంతం కీల‌క స‌న్నివేశాల్లో ఈ మేనేజ‌ర్ పాత్ర క‌నిపిస్తుంద‌ట‌. సీరియ‌స్‌గా సాగే ఎన్టీఆర్ జీవితంలో కామెడీ యాంగిల్‌ని వెన్నెల ఎలివేట్ చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌. అన్న‌ట్టు ఎన్టీఆర్ పీఏ రుక్మానంద‌రావు ఎవ‌రో తెలుసా? స్వ‌యానా బావ‌మ‌రిది.. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం సోద‌రుడు. క‌థానాయ‌కుడు జ‌న‌వ‌రి 9న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments