ఎన్టీఆర్.. అన్న ఫంక్షన్ కు ఎందుకు రాలేదు..?

Last Updated on by

ఈ మ‌ధ్య క‌ళ్యాణ్ రామ్ ఏ సినిమా చేసినా ఆ సినిమా ఆడియో వేడుక‌కు పిల‌వ‌కుండానే వ‌చ్చే అతిథి ఎన్టీఆర్. జాన‌కిరామ్ చ‌నిపోయిన త‌ర్వాత అన్న‌య్య‌కు మ‌రీ క్లోజ్ అయిపోయాడు నంద‌మూరి చిన్నోడు. అప్ప‌ట్నుంచి ప‌టాస్.. షేర్.. యిజం ఇలా ఏ వేడుక జ‌రిగినా కూడా అందులో ఎన్టీఆర్ ఉండాల్సిందే. ఇక ఎన్టీఆర్ వేడుక‌ల‌కు కూడా క‌ళ్యాణ్ రామ్ కంప‌ల్స‌రీ అయిపోయాడు. ఈ అన్నాద‌మ్ముల బాండింగ్ అంత‌గా క‌లిసింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ వేడుక‌కు కూడా ఎన్టీఆర్ వ‌స్తాడ‌నే అంతా అనుకున్నారు. కానీ ఈయ‌న రాలేదు. అదే అంద‌రికి స‌ర్ ప్రైజింగ్. పైగా ఎన్టీఆర్ ఖాళీగానే ఉన్నాడిప్పుడు. త్రివిక్ర‌మ్ షూటింగ్ కూడా మొద‌లు కాలేదు. అన్నింటికీ మించి హైద‌రాబాద్ లోనే ఉన్నాడు.

ఎన్టీఆర్ ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ వేడుక‌కు ఎందుకు రాలేదో తెలుసా.. దాని వెన‌క ప‌క్కా కార‌ణం ఉంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఓల్డ్ లుక్ లో లేడు. త్రివిక్ర‌మ్ సినిమా కోసం కొత్త లుక్ ఒక‌టి ట్రై చేసాడు. ఈ మ‌ధ్యే ఆ లుక్ లీక్ అయింది కూడా. అయితే సినిమా మొద‌ల‌య్యే వ‌ర‌కు కూడా ఆ లుక్ బ‌య‌టికి రాకుండా ఉండటానికి జాగ్ర‌త్త ప‌డుతున్నాడు జూనియ‌ర్. అందుకే ఈ లుక్ రివీల్ కాకూడ‌ద‌నే కార‌ణంతోనే ఎన్టీఆర్ ఎమ్మెల్యే వేడుక‌లో క‌నిపించ‌లేదు. అంతేత‌ప్ప క‌ళ్యాణ్ రామ్ వేడుక‌కు రాకూడ‌ద‌నీ కాదు.. అన్న‌య్య‌తో ఎలాంటి విభేదాలు లేవు.. సింపుల్ కొత్త సినిమా కోస‌మే ఎన్టీఆర్ ఎమ్మెల్యేకు హ్యాండిచ్చాడ‌న్న‌మాట‌.

User Comments