ఎన్టీఆర్‌కు ఆ పెళ్లి ఇష్టం లేదు!

Last Updated on by

నిమ్మ‌కూరు చిన్నోడు.. విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడు తేజ స్థానంలో క్రిష్‌ని ఈ బ‌యోపిక్ కోసం బాల‌య్య ఎంపిక చేసుకున్నార‌ని అత్యంత స‌న్నిహిత వ‌ర్గాల ద్వారా లీకైంది. అంత‌కుమించిన ఓ హాట్ అప్‌డేట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

తార‌క రామారావు మామూలు కుర్రాడు కాదు. ఆక‌తాయ్‌.. అల్ల‌రి గ‌డుగ్గాయ్‌.. రొమాంటిక్ ఫెలో. త‌న స్వ‌స్థ‌లం నిమ్మ‌కూరులో నూనూగు మీసాల వ‌య‌సులో వేసిన వేషాలు మామూలువి కావు. యుక్త‌వ‌య‌సులో పాల‌మ్మాయ్ వెంట ప‌డ్డాడు. త‌న‌ని పిచ్చిగా ప్రేమించాడు. అయితే ఆ స్పీడ్ త‌ట్టుకోలేక ఎన్టీఆర్ త‌ల్లిదండ్రులు పిల్ల‌ను చూశారు. అలా త‌న‌ పెళ్లి త‌ల్లిదండ్రులు చూసిన బ‌స‌వ‌తార‌కంతోనే జ‌రిగింది. ఆ పెళ్లి ఎన్టీఆర్‌కు ఎంత‌మాత్రం ఇష్టం లేదు. తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడ‌తాన‌ని ప‌ట్టుబ‌ట్టాడు. కానీ తానొక‌టి త‌లిస్తే, విధి వేరొక‌టి త‌లిచింది. అయితే విధి ఆడిన వింతాట‌లో… చివ‌రికి బ‌స‌వ‌తార‌కంని పెళ్లి చేసుకున్న త‌ర‌వాత అన్యోన్యంగా దాంప‌త్యం సాగించారు. అటుపై క‌థ తెలిసిందే. ఇక ఈ చిత్రంలో తొలి 40 నిమిషాలు నిమ్మ‌కూరులో బాల‌కుడైన ఎన్టీఆర్‌పై ఉంటుందిట‌. యుక్త‌వ‌య‌సు ఎన్టీఆర్‌గా జూ.ఎన్టీఆర్ లేదా నాని, శ‌ర్వానంద్‌లో ఎవ‌రో ఒక‌రు న‌టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

User Comments