చ‌ర‌ణ్, ఎన్టీఆర్ తో కలిసి బోయపాటికి హ్యాండిచ్చాడు

Last Updated on by

ఏం చేసారు..? హ్యాండివ్వడం ఏంటి అనుకుంటున్నారా..? ఓ ద‌ర్శ‌కుడి కోసం మ‌రో ద‌ర్శ‌కున్ని ఇబ్బంది పెట్ట‌డం త‌ప్పా కాదా..? ఇప్పుడు చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారు. నిజానికి రామ్ చ‌ర‌ణ్ మార్చ్ 6 నుంచి బోయ‌పాటి సినిమాలో అడుగుపెట్టాలి. ఈ చిత్ర షూటింగ్ హైద‌ర‌బాద్ లోనే ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడు ఈయ‌న అమెరికా వెళ్లిపోతున్నాడు. అది కూడా ఎన్టీఆర్ తో క‌లిసి. ఈ ఇద్ద‌రూ ఎందుకు అనే అనుమానం రావాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఇద్ద‌రు క‌లిసి ఇప్పుడు రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌బోతున్నారు కాబ‌ట్టి. అక్టోబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్ర‌ వ‌ర్క్ షాప్ కోసం అమెరికా పంపించాడు రాజ‌మౌళి. అక్క‌డే ప‌ది రోజుల పాటు ఉండ‌బోతున్నారు ఈ హీరోలు. రాజ‌మౌళి ఇండియాలోనే ఉన్నా.. ఇక్క‌డి నుంచే అన్ని ప‌నులు కో ఆర్డినేట్ చేసుకోనున్నాడు.NTR Ram Charan Going Los Angeles For Photoshootమార్చ్ చివ‌రి వారంలో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇండియాకు రానున్నారు. అక్క‌డే వీళ్లిద్ద‌రిపై ప్ర‌త్యేకంగా ఓ ఫోటోషూట్ కూడా చేయించ‌నున్నాడు రాజ‌మౌళి. మార్చ్ చివ‌ర్లో వ‌చ్చి త్రివిక్ర‌మ్ సినిమాతో ఎన్టీఆర్.. బోయ‌పాటి సినిమాతో రామ్ చ‌ర‌ణ్ బిజీ కానున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో అక్టోబ‌ర్ లోపు ఈ చిత్రాలు పూర్తి కావాల‌ని ఇప్ప‌టికే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు రాజ‌మౌళి. ఈ టైమ్ లో ఆల‌స్యం అయితే మాత్రం అస‌లుకే ఎస‌రు త‌ప్ప‌దు. అందుకే చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్ పై చాలా జాగ్ర‌త్త‌గా ఉన్నారు. అయితే అంతా అనుకుంటున్న‌ట్లుగా ఈ చిత్రం నార్మ‌ల్ సినిమా ఏమీ కాద‌ని.. ఇందులోనూ భారీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఉండ‌బోతున్నాయని తెలుస్తుంది. 2019లో కాకుండా 2020లోనే రాజ‌మౌళి మ‌ల్టీస్టార‌ర్ విడుద‌ల కానుంది.

User Comments