ఛీ కొట్టకుండా ఉంటే చాలన్న ఎన్టీఆర్..

జీవితంలో మ‌న‌కు త‌గిలే ప్ర‌తీ ఎదురుదెబ్బ నుంచి ఓ గుణ‌పాఠం నేర్చుకుంటే అంత‌కంటే మంచిది మ‌రోటి లేదు. అందుకే చెడు కూడా మ‌న‌కు మంచే చేస్తుందంటారు పెద్ద‌లు. గ‌తంలో జ‌రిగిన చెడే.మ‌న భ‌విష్య‌త్తుకు మంచిని నిర్ణ‌యిస్తుంది.ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే చేస్తున్నాడు.ఈయ‌న గ‌త కొంత‌కాలంగా చాలా మారిపోయాడు.అస‌లు మూడేళ్ల కింద ఎన్టీఆర్ ఇలా ఉండేవాడు కాదు ఇప్పుడు మాట్లాడుతున్న ఎన్టీఆర్ అప్పుడు లేడు. ఇప్పుడేం మాట్లాడినా ఆచితూచి. ఓ మెచ్యూర్డ్ ప‌ర్స‌న్ లా మారిపోయాడు జూనియ‌ర్. నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తీ మాట‌లో ఎంతో అర్థాన్ని చెబుతున్నాడు ఎన్టీఆర్.అది అనుభ‌వమే కావ‌చ్చు..

అనుభ‌వం నేర్పిన గుణ‌పాఠ‌మే కావ‌చ్చు. జీవితంలో ప్ర‌తీ విష‌యాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకోవ‌డం.. చేసే ప్ర‌తీ ప‌ని వ‌ల్ల ఏదో ఒక‌టి నేర్చుకోవ‌డం అల‌వాటు చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. అది సినిమాల ప‌రంగా కూడా.అందుకే గ‌త మూడేళ్లుగా ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమాలు వ‌స్తున్నాయి.

టెంప‌ర్ నుంచి మారిపోయాడు ఎన్టీఆర్. ఇక 25వ సినిమాగా వ‌చ్చిన నాన్న‌కు ప్రేమ‌తో నుంచి పూర్తిగా మారిపోయాడు ఎన్టీఆర్. ఆ సినిమా ప‌ర్స‌న‌ల్ గా కూడా జూనియ‌ర్ ను చాలా మార్చేసింది. ఎంచుకునే ప్ర‌తీ క‌థ‌పై ఓ బాధ్య‌త ఉండాల‌ని నిర్దేశించేలా ఎన్టీఆర్ మనసును మార్చేసింది నాన్న‌కు ప్రేమ‌తో.

ఒక్క‌సారి గ‌తం చూసుకుంటే ఎన్టీఆర్ కెరీర్ లోనూ ‘నాగ‌.. న‌ర‌సింహుడు, సుబ్బు,ర‌భ‌స‌, లాంటి ఎన్నో అర్థం ప‌ర్థం లేని సినిమాలు ఉన్నాయి. అవి చేయ‌డం వ‌ల్ల విమ‌ర్శ‌లు కూడా అందుకున్నాడు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు మ‌నోడిలో చాలా మార్పు వ‌చ్చింది. నాన్న‌కు ప్రేమ‌తో నుంచి ఓ సినిమా హిట్టైనా.. ఫ్లాపైనా ప‌ర్లేదు కానీ వీడు మంచి ప్ర‌య‌త్నం చేసాడ్రా అని ప్రేక్ష‌కుడు అనుకుంటే చాలు అంటున్నాడు ఎన్టీఆర్ అరే……అన‌వ‌స‌రంగా ఈ చిత్రం చేసాడు అని ప్రేక్ష‌కుడు భావించ‌కూడ‌దు. అదే టైమ్ లో ఈ చిత్రం ఎందుకు చేసానా అని తాను కూడా ఫీల్ కాకూడ‌దు ఇదే త‌న ల‌క్ష్యం అంటున్నాడు ఎన్టీఆర్.