యాడ్స్‌తో తార‌క్ రెవెన్యూ?

Last Updated on by

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్రాండ్ వ్యాల్యూ ఎంత ఉంది మార్కెట్లో? అంటే ఒక్కో సినిమాకి అతడు 15కోట్ల మేర పారితోషికం అందుకుంటాడన్న సమాచారం ఉంది. దాంతో పాటే అతడు వాణిజ్య ప్రకటనల కాంట్రాక్టులు కుదుర్చుకోవడం ద్వారా భారీ మొత్తాల్ని ఆర్జిస్తున్నాడు. టాలీవుడ్లో ఉన్న రేర్ ట్యాలెంట్ ఎన్టీఆర్ అంటే కార్పొరెట్ కంపెనీలు క్యూ కడతాయి. అతడికి మాస్లో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఎంఈవోలు కుదుర్చుకునేందుకు తహతహలాడుతుంటాయి. మహేష్, చరణ్ తరహాలోనే తారక్ ఆదాయం ప్రకటనల ద్వారా తక్కువేం కాదు.

అసలింతకీ తారక్ చేస్తున్న బ్రాండ్లు ఏవి? అంటే… హిమానీ నవరత్న, మలబార్ గోల్డ్, బోరో ప్లస్ వంటి ప్రకటనలకు కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. వీటి ద్వారా కార్పొరెట్ నుంచి భారీ మొత్తమే అకౌంట్లోకి వస్తుంది. ఏడాదికి ఇన్ని కోట్లు అంటూ ఒప్పందం చేసుకుని వాటికి కావాల్సిన విధంగా ప్రకటనల్లో నటించడం తారక్ పని. రీసెంటుగానే సెల్టెక్ మొబైల్ కంపెనీతో తారక్ ఒప్పందం గురించి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ రంగంలో సెల్టెక్ వేగంగా విస్తరించే లక్ష్యంతో అతడి ద్వారా ప్రచారానికి దిగుతోంది. ఈ బ్రాండ్ తో తారక్ ఆదాయం మరింత పెరిగింది. బ్రాండ్ విలువ, రేంజును బట్టి ప్రకటనకు ఇంత అని నిర్ణయించుకుంటారు. ఆ రకంగా చూస్తే తారక్కి సంవత్సరానికి 10-20 కోట్ల మేర ఆదాయం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.ఇకపోతే సెల్టెక్ సంస్థ కోటిన్నర వరకూ సంవత్సరానికి తారక్కి చెల్లించుకుంటోందిట. ఓవరాల్గా 20కోట్ల వరకూ బ్రాండ్స్ రూపంలో అతడు ఆర్జిస్తాడన్న అం

User Comments