అభ‌య్ రామ్‌ బ్ర‌ద‌ర్‌ భార్గ‌వ రామ్‌

Last Updated on by

నంద‌మూరి తార‌క‌రామారావు అంశ‌తో జ‌న్మించిన ఎన్టీఆర్ టాలీవుడ్‌ని ఏల్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడున్న న‌వ‌త‌రం స్టార్ల‌లో ఎన్టీఆర్ అసాధార‌ణ స్టార్‌డ‌మ్‌ని అస్వాధిస్తున్నాడు. గ‌త కొంత‌కాలంగా బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల క్ల‌బ్ క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ హ‌వా సాగిస్తున్నాడు. మొద‌టి పుత్రుడు అభ‌య్‌రామ్ పుట్టిన‌ప్పుడు `నాన్న‌కు ప్రేమ‌తో` రూపంలో బంప‌ర్ హిట్ అందుకున్నాడు. గ‌త నెల‌లోనే రెండో పుత్రుడు జ‌న్మించాడు. ఇక తార‌క్ కెరీర్ ధేధీప్య‌మానంగా వెలిగిపోతుంద‌న‌డంలోనూ ఎలాంటి సందేహం లేదు.

1+1 డ‌బుల్ బొనాంజ ధ‌మాకా ఆఫ‌ర్‌తో.. ఆ ఉత్సాహంలో ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోని యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఉర‌క‌లెత్తే ఉత్సాహంతో షూటింగుల్లో పాల్గొంటున్నాడు. త‌దుప‌రి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తాడు. అయితే పుత్రోత్సాహ‌ము ఆ సుపుత్రుని క‌నంగా .. అన్న చందంగా.. అత‌డిలో నిత్య‌నూత‌న ఉత్సాహం ఎలా ఉందో ఇదిగో ఈ ఫోటో చూస్తే ఇట్టే చెప్పేయొచ్చు. చిన్నారి అభ‌య్‌రామ్‌, ల‌క్ష్మీ ప్ర‌ణ‌తితో పాటు ఎన్టీఆర్ ఒడిలో నెల అయినా నిండ‌ని చిన్నారి బాల‌కుడు ఉన్నాడు. తార‌క్ ఈ ఫోటోలో ఎంతో సంతోషంగా క‌నిపిస్తున్నాడు. అంతేకాదు త‌న రెండో కొడుక్కి అభ‌య్‌రామ్ అని పేరు పెట్టుకున్నామ‌ని సామాజిక మాధ్య‌మాల్లో వెల్ల‌డించారు.

User Comments