ఫ్యాన్స్‌కి తార‌క్ బిగ్‌షాక్‌

Last Updated on by

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మూడు నెల‌ల పాటు ఎవ‌రికి క‌నిపించ‌రు… వినిపించ‌రు. ముఖ్యంగా అభిమానులకు అస‌లే క‌నిపించ‌రు!! ఎట్టెట్టా? అంటారా.. అవును నిజ‌మే యంగ్ య‌మ అదృశ్య‌మ‌వుతున్నారు. ఫ్యాన్స్ కి దూరంగా జ‌రుగుతున్నారు. అదెట్టా.. అంటే ఇన్నాళ్లు ఫ్యాన్స్‌తో నేరుగా ట‌చ్‌లో ఉంటున్న ఎన్టీఆర్ సామాజిక మాధ్య‌మాల్ని బ్లాక్ చేస్తున్నారు. అక్క‌డ త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త స‌మాచారం పోస్ట్ చేయ‌డ‌ట‌.

ఆర్నెళ్లు సోష‌ల్ మీడియాలు బంద్ అంటే ల‌క్ష‌ల్లో అభిమానులు గిల‌గిల‌లాడిపోవ‌డం ఖాయం అన్న‌మాట‌. ట్విట్ట‌ర్‌లో 24ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్, ఇన్‌స్టాలో 26 ల‌క్ష‌ల‌ ఫాలోవ‌ర్స్ ఇక గిజ‌గిజ‌లాడాల్సిందే. త‌మ అభిమాన తార‌క‌రాముని ద‌ర్శ‌నం లేక ల‌బోదిబోమ‌నాల్సిందే. అయితే ఇదంతా ఎన్టీఆర్ ఎందుకు చేస్తున్నారు? అంటే దానికి స‌హేతుక కార‌ణం ఉంది. డిజిట‌ల్ డిటాక్స్ పేరుతో స‌హ‌జ‌సిద్ధ జీవ‌నంలో భాగంగా ఆర్నెళ్లు వీట‌న్నిటికీ దూరమ‌వుతున్నార‌ట‌. అంటే ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇత‌ర‌త్రా ఎల‌క్ట్రానిక్ డివైస్‌ల‌కు దూరంగా ఉంటార‌న్న‌మాట‌!! ఇదివ‌ర‌కూ రామ్‌చ‌ర‌ణ్ ఇలా చేశారు. స‌ల‌హా ఫ్రెండ్ నుంచే తీసుకున్నాడంటారా?

User Comments