త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ కోల్డ్ వార్

NTR Trivikram Cold War

అదేంటి.. ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేయ‌బోతున్నారు.. ఇలాంటి టైమ్ లో త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ కోల్డ్ వార్ ఏంటి అనుకుంటున్నారా..? అవును.. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ సినిమా చేయ‌బోతున్నారు. కానీ త్రివిక్ర‌మ్ చెప్పిన క‌థ నిజంగానే ఎన్టీఆర్ కు న‌చ్చిందా.. లేదంటే మ‌రో క‌థ కావాల‌న్నాడా..? ఇప్పుడు ఇదే ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్న హాట్ హాట్ చ‌ర్చ‌.

అస‌లు విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్ కు త్రివిక్ర‌మ్ ఓ యాక్ష‌న్ స్టోరీ చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇది జూనియ‌ర్ కు కూడా బాగానే న‌చ్చింది. కానీ మ‌రో క‌థపై ఎన్టీఆర్ మ‌న‌సు ప‌డ్డాడు. ఆ క‌థ త‌న‌తో చేయాల్సిందిగా త్రివిక్ర‌మ్ ను ఎన్టీఆర్ కోరాడ‌ని తెలుస్తోంది. కానీ దానికి మాట‌ల మాంత్రికుడు మాత్రం నో చెప్పాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనికి ఓ కారణం కూడా ఉంది.

మ‌హేశ్ తో ఎన్నాళ్ల నుంచో ఓ సినిమా చేయాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్. కానీ టైమ్ క‌లిసి రావ‌డం లేదు. టాప్ హీరోలంద‌రికీ హిట్లిచ్చిన త్రివిక్ర‌మ్.. మ‌హేశ్ కు మాత్ర‌మే బాకీ ప‌డిపోయాడు. దాంతో ఎలాగైనా సూప‌ర్ స్టార్ కు ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌నేది త్రివిక్ర‌మ్ క‌ల‌. అందుకే ఆయ‌న కోస‌మే ప్ర‌త్యేకంగా ఓ క‌థ సిద్ధం చేసాడు మాట‌ల మాంత్రికుడు. అదే క‌థ‌ను ఎన్టీఆర్ కూడా విన్నాడు. కానీ ఎన్టీఆర్ కోసం అప్ప‌టికే మ‌రో క‌థ‌ను కూడా సిద్ధం చేసాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు త‌న కోసం ప్రిపేర్ చేసిన క‌థ కాకుండా.. మ‌హేశ్ కోసం రాసిన క‌థ‌ను త‌న‌తో చేయాలంటూ ఎన్టీఆర్ అడిగినట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఫైనల్ గా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా రేపే-అక్టోబర్ 23 న ఓపెనింగ్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అయితే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలోపు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి చెప్పిన స్టోరీ లో ఎన్ని మార్పులు జరుగుతాయో ఏంటో చూడాలి.