ఎన్టీఆర్ టైటిల్ అదేనా..?

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తాను కెరీర్ లో ఏ సినిమా చేయ‌నంత వేగంగా పూర్తి చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. అక్టోబ‌ర్ లోపు సినిమా పూర్తిచేసి విడుద‌ల చేయాల‌నేది త్రివిక్ర‌మ్ ప్లాన్. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అదే నెల నుంచి రాజ‌మౌళి సినిమాతో ఎన్టీఆర్ బిజీ అవుతాడు. అందుకే ముందే పూర్తి చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ విడుద‌ల‌య్యే తేదీ కూడా వ‌చ్చేసింది. మే 19 సాయంత్రం ఎన్టీఆర్ సినిమా టైటిల్ విడుద‌ల కానుంది.

ఆ త‌ర్వాత రోజు జూనియ‌ర్ పుట్టిన రోజు. అందుకే ఒక‌రోజు ముందుగానే ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ సినిమాకు రారా కుమారా అనే టైటిల్ అనుకుంటున్నార‌ని తెలుస్తుంది. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ త‌న ప్రేమ కోసం రాయ‌ల‌సీమ వెళ్తాడు. దాంతో క‌థ‌కు త‌గ్గ‌ట్లు రారా కుమారా అనే టైటిల్ బాగుంటుంద‌ని అనుకుంటున్న‌ట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు మ‌రో రెండు మూడు టైటిల్స్ కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. మ‌రి.. వీటిలో ఏది ఫైన‌ల్ అవుతుందో..?