ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ మ‌రోసారి

ఎన్టీఆర్ -త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మ‌ళ్లీ చేతులు క‌లుపుతుందా? ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత తార‌క్ న‌టించ‌బోయేది త్రివిక్ర‌మ్ సినిమాలోనేనా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తొలిసారి తెర‌కెక్కిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ భారీ విజ‌యాన్ని అందుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఇద్ద‌రి బాండింగ్ స్ర్టాంగ్ అయింది. ఈ హిట్ తో త్రివిక్ర‌మ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సినిమాకు త్రివిక్ర‌మ్ ఎంత ఎఫ‌ర్ట్ పెట్టాడో సినిమా చూస్తేనే అర్ధ‌మ‌వుతోంది.

అందుకే మ‌రోసారి తార‌క్ మాట‌ల మాత్రికుడితో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. 2020లో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి. అర‌వింద స‌మేత‌ వీర రాఘ‌వ త‌ర‌హాలోనే అదిరిపోయే స్ర్కిప్ట్ అని స‌మాచారం. ప్ర‌స్తుతం తార‌క్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ లో న‌టిస్తున్నాడు. త్రివిక్ర‌మ్ బ‌న్నీతో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇవి రెండు వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్నాయి. అనంత‌రం ఈ ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ రానుంది.

Also Read : Ntr’s Next After RRR Confirmed