40 ఏళ్ల యుగ‌పురుషుడు

Last Updated on by

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వ‌ర్గీయ‌ నందమూరి తారక రామారావు నటించిన యుగపురుషుడు విడుదలై 40 ఏళ్లు పూర్త‌యింది. తార‌క‌రాముని కెరీర్‌లోని గ్రేట్ మ్యూజిక‌ల్ హిట్ చిత్రాల్లో ఈ సినిమాకి అగ్ర‌తాంబూలం ఇవ్వొచ్చు. జూలై 14, 1978లో రిలీజైంది ఈ సినిమా. ఎన్టీఆర్ కెరీర్‌లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న మేటి సినిమాల్లో ఒక‌టి ఇది.

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ వైజయంతి ఫిలింస్ ప‌తాకంపై మెగానిర్మాత సి.అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నాడు నిర్మించారు. కె.బాప‌య్య దర్శకత్వ ం వహించారు. ఎన్టీఆర్‌తో మెగా నిర్మాత అశ్వ‌నిదిత్ నిర్మించిన రెండో సినిమా ఇది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్, జయప్రదల మధ్య శృంగార సన్నివేశాలు కొత్త ఒర‌వ‌డిని సృష్టించాయి. యువతరాన్ని ఆకర్షించే అనేక అంశాలు ఉండడం ఈ చిత్రం ప్రత్యేకత. ప్రభాకర్ రెడ్డి, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించారు. అంతకు ముందు బాప‌య్య‌- అశ్వ‌నిద‌త్ కాంబినేష‌న్‌లో ఎదురులేని మనిషి (1975) అనే చిత్రం వ‌చ్చింది. ఈ కాంబినేష‌న్ రెండో ప్ర‌య‌త్న ం ఏ దివ్య‌ ముహుర్తాన ఎన్టీఆర్‌ చిత్రానికి యుగ‌పురుషుడు అని పేరు పెట్టారో కానీ నాటి నుంచి ఎన్టీఆర్‌ను యుగపురుషుడిగా అభిమానులు కీర్తించారు.

User Comments