ఎన్టీఆర్ పాలిటిక్స్ కు ఫ్యాన్స్ సెంటిమెంట్ షాక్

NTRs Political Failure Worries Jai Lava Kusa

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్ తో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే రిలీజైన ‘జై’ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటగా.. తాజాగా బయటకొచ్చిన షూటింగ్ కు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ అయితే సినిమాపై ఎక్కడలేని ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎందుకంటే, జై టీజర్ లో రావణగా నెగిటివ్ టచ్ తో పిచ్చెక్కించిన ఎన్టీఆర్.. ఇప్పుడు వర్కింగ్ స్టిల్స్ పుణ్యమా అని ‘సమ సమాజ్ పార్టీ’ అనే పొలిటికల్ పార్టీ నాయకుడిగా నటిస్తున్నాడని తెలియడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ముఖ్యంగా పొలిటికల్ లీడర్ గా ఎన్టీఆర్ ఆహార్యం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యేలా కనిపించడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ తాజా పొలిటికల్ టచ్ కు ఫీలవుతుండటం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రధానంగా పొలిటికల్ టచ్ తో ఫ్లాప్ సెంటిమెంట్ ను చూపిస్తూ.. అప్పుడే జైలవకుశ పై నెగిటివ్ ప్రచారానికి తెర తీయడం గమనార్హం. ఆ విషయంలోకి వెళితే, ఎన్టీఆర్ పూర్తి స్థాయి పొలిటికల్ టచ్ తో వచ్చిన ‘నాగ’.. లీడర్ గా చిన్న చిన్న పొలిటికల్ పంచ్ లు పేల్చిన ‘దమ్ము’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.
అలాగే రాజకీయాల్లో సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తుచేస్తూ సైకిల్ తో ఒకే ఒక్క డైలాగ్ చెప్పిన ‘కంత్రి’ కూడా ఫ్లాప్ అవడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ పాలిటిక్స్ ను టచ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ భయపడుతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా పాలిటిక్స్ మనకు పెద్దగా కలిసి రాలేదని, సెంటిమెంట్ దృష్ట్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడే కామెంట్స్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా కథ బాగుండాలి, సినిమాలో మేటర్ ఉండాలే గాని.. ఇటువంటి సెంటిమెంట్లు ఎక్కువ కాలం నిలబడవని వేరే చెప్పాలా ఏంటి. మరి ఈ లెక్కన ఎన్టీఆర్ ఈసారి పొలిటికల్ టచ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడో లేక సెంటిమెంట్ కు తలొగ్గుతాడో చూడాలి.