ఆఫీస‌ర్ బ‌య్య‌ర్ సూసైడేనా?

Last Updated on by

కింగ్ నాగార్జున‌- రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీ `ఆఫీస‌ర్‌` ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ ఫ‌లితం బ‌య్య‌ర్ల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ముఖ్యంగా ఈ సినిమాని భారీ రేటుకు కొనుక్కున్న ఆంధ్రా బ‌య్య‌రుకు ఓ రేంజులోనే పంచ్ ప‌డిందిట‌. రాజ‌మండ్రికి చెందిన సుబ్ర‌మ‌ణ్యం అనే బ‌య్య‌రు `శివ‌` కాంబినేష‌న్‌పై న‌మ్మ‌కంతో ఆఫీస‌ర్‌పై 3.5కోట్ల పెట్టుబ‌డి పెట్టాడుట‌. నాగార్జున‌ `రాజుగారిగ‌ది 2` ఏపీ హ‌క్కులు 7.2కోట్ల‌కు సేల్ అయ్యింది.

ఆ మొత్తంతో పోలిస్తే స‌గం రేటుకే వ‌స్తుంద‌ని `ఆఫీస‌ర్`ని కొనుక్కున్నాడుట‌. అయితే ఆర్జీవీ ఫ్లాప్‌ల రికార్డును పట్టించుకోకుండా ఇంత పెద్ద మొత్తం పెట్టినందుకు రిట‌ర్న్స్ రాక ల‌బోదిబోమంటున్నాడ‌ట‌. ఆంధ్రాలో స‌రిగా ఆడ‌క‌ సొమ్ములు తిరిగి రాక‌పోవ‌డంతో చిన్నా చిత‌కా కొనుగోలు దారుల నుంచి ఫోన్ కాల్స్ వెల్లువ‌.. మొద‌లైందిట‌. దీంతో ఆ టార్చ‌ర్ భ‌రించ‌లేని అత‌గాడు తెలుగు ఫిలింఛాంబ‌ర్‌ని సంప్ర‌దించే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఆర్జీవీ ప‌ర్స‌న‌ల్‌గా ట‌చ్‌లో లేరు. ఆఫీస‌ర్‌ స‌హ‌నిర్మాత సుధీర్‌ చంద్ర‌తో డీల్ పూర్తి చేశాను.. అని అంటున్నాడ‌ట‌. న‌ష్టం రిక‌వ‌రీ కాక‌పోతే ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్యం అని స‌ద‌రు బయ్య‌రు వాపోతున్నాడ‌ట‌. మొత్తానికి వ‌ర్మ పంచ్ ఆ బ‌య్య‌రుకు అలా ప‌డింద‌ని ట్రేడ్‌లో మాట్లాడుకుంటున్నారు

User Comments