`కాలా` రాకముందే ఖాళీ

Last Updated on by

కాలా రాక‌ముందే ఆఫీస‌ర్‌ని ఖాళీ చేశారు! ఇంత‌కీ ఏ ఆఫీస‌ర్‌? ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఆర్జీవీ సంధించిన ఆఫీస‌ర్‌ని థియేట‌ర్ల నుంచి ఖాళీ చేయించారు. ఇది ఆర్జీవీకే కాదు.. కింగ్ నాగార్జున‌కు షేమ్ అనే చెప్పాలి. నాగార్జున కెరీర్‌లోనే కేడి, భాయ్ త‌ర‌వాత అంత‌టి డిజాస్ట‌ర్ సినిమా ఇద‌ని అభిమానులే వ‌ర్మ‌పై ఫైరైపోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇప్ప‌టికే ఆఫీస‌ర్ చిత్రాన్ని మెజారిటీ పార్ట్ థియేట‌ర్ల నుంచి తొల‌గించార‌ని తెలుస్తోంది. ఈ ఆదివార‌మే కొన్ని థియేట‌ర్ల నుంచి తొల‌గించి మ‌హాన‌టి వేశార‌న్న స‌మాచారం ఉంది.

ఇక ఎలానూ ఈ గురువారం కాలా రిలీజ‌వుతోంది కాబ‌ట్టి ఇత‌ర‌త్రా థియేట‌ర్ల నుంచి ఆఫీస‌ర్‌ని తొల‌గిస్తార‌ని చెబుతున్నారు. నాగార్జున కెరీర్ నంబ‌ర్ 1 డిజాస్ట‌ర్ గా రికార్డులకెక్కిన ఆఫీస‌ర్‌ని స్నేహితుడు వ‌ర్మ తీయ‌డం ఓ సంచ‌ల‌నం అని చెప్పాలి. రిలీజైన కేవ‌లం మూడు రోజుల్లోనే ఆఫీసర్‌కి ఇలాంటి స‌న్నివేశం వ‌స్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు దీనిపై అక్కినేని అభిమానులే గ‌రంగ‌రంగా ఉండ‌డంపై వాడి వేడి చ‌ర్చ సాగుతోంది. ఇక ఇంత పెద్ద ఫ్లాప్‌ని ఇచ్చిన స్నేహితుడు వ‌ర్మ విష‌యంలో నాగార్జున ఇప్ప‌టికీ పాజిటివ్ దృక్ప‌థంతో ఉండ‌డంపైనా అభిమానులు సీరియ‌స్‌గానే ఉన్నార‌ట‌.

User Comments