ట్రైల‌ర్‌: స‌్టెప‌ప్‌ని దించేశాడు

Last Updated on by

హాలీవుడ్ `స్టెప‌ప్` సిరీస్ స్ఫూర్తితో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో సినిమాలు తెర‌కెక్కాయి. ఆ సినిమాల్లో పాశ్చాత్య నృత్యాల‌కు స్పెల్ బౌండ్ కాని ప్రేక్ష‌కుడే ఉండ‌డు. అస‌లు డ్యాన్స్ అంటే ఏంటో తెలీని వాళ్లు కూడా ఈ సినిమాలు చూస్తే ఇన్‌స్ప‌యిర్ అవుతారు. అథ్లెటిక్ స్టైల్ స్ప్రింగ్ యాటిట్యూడ్‌తో ఈ సినిమాల్లో డ్యాన్స‌ర్లు చేసే విన్యాసాలు కళ్ల ముందు మిరిమిట్లు గొలుపుతాయి. ఇంకా చెప్పాలంటే ఆ డ్యాన్సుల్లో వేగం కంటి పాప మీద మెరుపు విన్యాసంలా అనిపిస్తుంది. అందుకే ఈ త‌ర‌హా సినిమాలు ఎన్నో ఎన్నో వ‌స్తూనే ఉన్నాయి.

ఇక అదే త‌ర‌హాలో టాలీవుడ్‌లోనూ ఇదివ‌ర‌కూ `స్టైల్` అనే సినిమా వ‌చ్చింది. ఆ చిత్రంలో ప్ర‌భుదేవా, లారెన్స్ వంటి కొరియోగ్రాఫ‌ర్లు హీరోలుగా న‌టించి ఇర‌గ‌దీసేశారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌ కొరియోగ్రాఫ‌ర్ కం డైరెక్ట‌ర్ రెమో.డి.సౌజా ఏకంగా స్టెప‌ప్ త‌ర‌హాలోనే `ఎబిసిడి` సిరీస్‌ని ర‌న్ చేస్తున్నారు. ఈ ఫ్రాంఛైజీలో ఇప్ప‌టికే రెండు సినిమాలు రిలీజై సంచ‌ల‌న విజ‌యాలు సాధించాయి. ఎబిసిడి, ఎబిసిడి 2 చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీగా క‌లెక్ష‌న్లు సాధించాయి. అందుకేనేమో మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నం కోలీవుడ్‌లోనూ సాగుతోంది. ప్ర‌భుదేవా ప్ర‌ధాన పాత్రలో ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా టైటిల్ ల‌క్ష్మి. ఐశ్వ‌ర్య రాజేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌. టైటిల్ పాత్ర‌లో దిత్య భాండే న‌టిస్తోంది. తొలి ట్రైల‌ర్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా కొత్త ట్రైల‌ర్‌లోనూ డ్యాన్సుల‌తో ఇర‌గ‌దీశారు. బేబి దిత్య డ్యాన్సింగ్ స్టైల్‌, వేగం ఆక‌ట్టుకుంటుంది. ఒక డ్యాన్సింగ్ లెజెండ్ స్టోరి.. బిగ్గెస్ట్ డ్యాన్స్ ఫెస్టివ‌ల్ అన్న ట్యాగ్స్‌తో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

User Comments