మహేష్ బాకీ తీర్చుకుంటున్న సుకుమార్..

Last Updated on by

సుకుమార్ చాలా మంది హీరోల‌కు బాకీ ప‌డిపోయాడు. త‌న‌ను న‌మ్మి సినిమా ఇచ్చిన బ‌న్నీ.. ఎన్టీఆర్.. మహేష్ కు ఊహించిన విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాడు సుకుమార్. కానీ రామ్ చ‌ర‌ణ్ కు మాత్రం తొలి ప్ర‌య‌త్నంలోనే ఇండ‌స్ట్రీ హిట్ ఇచ్చేసాడు. దాంతో ఇప్పుడు ఇదే ఊపులో త‌నను గ‌తంలో న‌మ్మి మోస‌పోయిన హీరోల‌కు హిట్లు ఇచ్చేందుకు ఫిక్స్ అయిపోయాడు. ఈ క్ర‌మంలోనే ముందు మహేష్ తో సినిమా చేయ‌బోతు న్నాడు సుకుమార్. ఈ మ‌ధ్యే సినిమాపై సుక్కు క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చినా.. ఇప్పుడు నిర్మాత‌ల నుంచి అనౌన్స్ మెంట్ వ‌చ్చింది.

రంగ‌స్థ‌లంతో రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చిన మైత్రి మూవీ మేక‌ర్సే ఈ చిత్రాన్ని కూడా నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ సంస్థ‌లో శ్రీ‌మంతుడు చేసాడు మహేష్. ఇక సుకుమార్ కూడా రంగ‌స్థ‌లం చేసాడు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి సినిమాతో బిజీగా ఉన్న మహేష్.. ఇది అయిన త‌ర్వాత సుకుమార్ సినిమా మొద‌లు పెట్ట బోతున్నాడు. ఇక్క‌డ విచిత్రం ఏంటంటే 2018 చివ‌ర్లోనే సినిమా ప‌ట్టాలెక్కి.. 2019లో విడుద‌ల కానుంద‌ని స్వ‌యంగా నిర్మాత‌లే ప్ర‌క‌టించారు. అంటే వంశీకి ఉన్న‌ది ఎనిమిది నెల‌ల‌ టైమ్ అన్న‌మాట‌.

User Comments