బాలికపై అత్యాచారయత్నం.. వృద్ధిడికి దేహ‌శుద్ది

హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో ఏడేళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. స్థానికంగా నివసించే వెంకటయ్య అనే వ్యక్తి శనివారం రాత్రి ఏడేళ్ల బాలికను ఓ భవనంపైకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి యత్నించాడు. తెలుగు రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఎక్కడో ఓచోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కామాంధులు ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా వదలకపోవడం కలవరపరుస్తోంది. ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండటంతో ప్రజల్లోనూ ఆగ్రహ జ్వాలలు పెల్లుబికుతున్నాయి. అత్యాచార నిందితులు దొరికితే ముందు చావబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగిస్తున్నారు.