జగన్ ఆఫీసు వద్ద వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద నిద్రమాత్రలు మింగి ఓ‌ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. తాను మోస పోయానని, న్యాయం చేయాలని ఈ నెల 19న గన్నవరానికి చెందిన సత్యనాగ కుమారి స్పందనలో అర్జీ పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆమె అర్జీపై అధికారులు స్పందించకపోవడంతో నేడు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లింది.అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన సత్యనాగ కుమారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.