`డెడ్‌పూల్ 2`పై వ‌న్‌వ‌ర్డ్ స‌మీక్ష‌

Last Updated on by

ఆకుకు, వ‌క్క‌కు తేడా తెలియ‌ని వాళ్లెంద‌రో ట్విట్ట‌ర్‌లో ఖాతాలు ఓపెన్ చేసి, సినిమాల‌కు స‌మీక్ష‌లు చెబుతున్న రోజులివి. వంద‌ల కోట్ల బ‌డ్జెట్ల‌తో సినిమాలు తీస్తూ చివ‌రికి పిచ్చి వాళ్ల పిచ్చి రివ్యూల‌తో.. తామే పిచ్చివాళ్లం అవుతున్నామ‌ని సినిమా నిర్మాత‌లు స‌మీక్ష‌కుల‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇదో దారుణ‌మైన, ధైన్య‌మైన స‌న్నివేశం. ఇలాంటి దందాకోరుత‌నాన్ని ఏ ద‌ర్శ‌క‌నిర్మాతా స‌హించ‌లేర‌న్న‌ది వాస్త‌వం. ఇటీవ‌లి కాలంలో వ‌న్ వ‌ర్డ్ రివ్యూల పేరుతో ఎవ‌రికి వారు రేటింగులు ఇచ్చేస్తూ ప‌రిశ్ర‌మ‌ను దుంప‌నాశ‌నం చేయ‌డ‌మే ధ్యేయంగా కంక‌ణం క‌ట్టుకుంటున్నారు. 24 శాఖ‌ల కార్మికులు ఆధార‌ప‌డి జీవించే ఈ ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేసేందుకే అన్న‌ట్టుగా కొన్ని రివ్యూలు అంతే దారుణంగా ప‌రాకాష్ట‌ను చూపిస్తున్నాయి. అదృష్టం కొద్దీ అస‌లు ఆయా సినిమాల రేటింగుల్ని న‌మ్మ‌కుండా మౌత్ టాక్‌ను కూడా జ‌నం ఆశ్ర‌యిస్తున్నారు కాబ‌ట్టి కొంతైనా బ‌తికి బ‌ట్ట‌క‌డుతున్నాయి సినిమాలు.

అయితే ఇలాంటి వేళ కూడా కొంద‌రు సీనియ‌ర్ క్రిటిక్స్ సినీప‌రిశ్ర‌మ‌ను బ‌తికించే ప‌ని చేస్తున్నారు. మెజారిటీ పార్ట్ వాస్త‌వాల్ని రాసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాంటి ఉత్త‌మ క్రిటిక్‌గా బాలీవుడ్ స‌మీక్ష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌కి ప్ర‌త్యేకించి గుర్తింపు ఉంది. అత‌డు అటు హిందీ సినిమాల‌తో పాటు ఇత‌ర రెజియ‌న‌ల్ భాష‌ల సినిమాల్ని, హాలీవుడ్ సినిమాల్ని ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విశ్లేషిస్తున్నారు. వ‌న్ వ‌ర్డ్ రివ్యూలు ఇస్తున్నారు. తాజాగా రిలీజైన హాలీవుడ్ చిత్రం డెడ్‌పూల్ 2పై త‌ర‌ణ్ వ‌న్‌వ‌ర్డ్ రివ్యూ ఇచ్చారు. “డెడ్‌పూల్ 2.. విన్న‌ర్‌` అంటూ కోట్ చేశారు. “డైన‌మిక్ యాక్ష‌న్‌.. క్రేజీ మోస‌గాడి కామెడీ.. అద్భుతం. ర‌ణ‌వీర్ సింగ్ వాయిస్ వోవ‌ర్ డెడ్‌పూల్‌కి అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చింది. డెడ్‌పూల్ క్యారెక్ట‌ర్ స‌క్సెస్ వెన‌క ..2గంట‌ల కామెడీ.. యాక్ష‌న్ అక్క‌ర‌కొచ్చాయి“ అని ట్వీట్ చేశారు.

User Comments