మ‌రో స్టార్ డాట‌ర్ వ‌చ్చేస్తుందహో..!

ప‌క్క‌నున్న త‌మిళ ఇండ‌స్ట్రీ.. పైనున్న హిందీ ఇండ‌స్ట్రీతో పోలిస్తే తెలుగులో హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా వ‌చ్చింది త‌క్కువే. వ‌చ్చినా స‌క్సెస్ అయింది లేదు. ఒక‌వేళ నిల‌బ‌డినా అభిమానులు ఊరుకోరు. వ‌ద్దంటూ గోల పెడ‌తారు. ఎప్ప‌ట్నుంచో వారసురాళ్లు రావ‌డం వెళ్ల‌డం జ‌రుగుతుంది కానీ నిల‌బ‌డ‌టం మాత్రం లేదు. ఇప్పుడిప్పుడే కొణిదెల వార‌మ్మాయి నిహారిక ఏదో చేస్తుంది. ఇక ఇప్పుడు మ‌రో వార‌సురాలు కూడా వ‌స్తుంది. ఆమె శివానీ రాజ‌శేఖ‌ర్.. ఈ పేరుతో ఇప్పుడు ప‌రిచ‌యం కాస్త త‌క్కువే. కానీ త్వ‌ర‌లోనే క‌చ్చితంగా తెలుగుతో పాటు తమిళ ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ పేరు ప‌రిచ‌యం కానుంది. పేరులోనే తండ్రి పేరు పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రాజ‌శేఖ‌ర్ కూతురు. ఒక‌ప్పుడు స్టార్ గా వెలిగిన రాజ‌శేఖ‌ర్ ఇప్పుడు జోరు త‌గ్గించారు. ప్ర‌స్తుతం ఈయ‌న గ‌రుడ‌వేగ సినిమా చేస్తున్నాడు.
ఈయ‌న సంగ‌తి అటుంచితే.. కూతురు తెరంగేట్రంపై చాలా ఆలోచ‌న‌లే చేస్తున్నాడు రాజ‌శేఖ‌ర్. ముఖ్యంగా త‌న కూతుళ్ల‌ను స్టార్ హీరోయిన్లుగా మార్చ‌డానికి జీవిత ఎత్తులు బాగా వేస్తుంద‌ని తెలుస్తోంది. ఆ మ‌ధ్య శివానీ ఫోటోషూట్ ఒక‌టి విడుద‌లైంది. ఇది చూస్తుంటే అన్నింటికీ సిద్ధ‌పడే ఇండ‌స్ట్రీకి రావ‌డానికి ఈ ముద్దుగుమ్మ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. అయినా జీవిత‌కు తెలియ‌ని ఇండ‌స్ట్రీనా ఇది. గ్లామ‌ర్ షో లేక‌పోతే స్టార్ డాట‌ర్ అయినా.. ఎవ‌రైనా ఇంటి ముఖం ప‌ట్టాల్సిందే. అందుకే కూతుళ్ల‌కు ఫుల్ గా ఫీడింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతుంది ఈ మాజీ హీరోయిన్. ఇప్పుడు తండ్రి సినిమా గ‌రుడ‌వేగ టీజ‌ర్ లాంచ్ కు వ‌చ్చిన శివానీ అక్క‌డి వారి చూపుల‌ను ఆక‌ర్షించింది. ఇప్ప‌టికే నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమాలో శివానీ న‌టించ‌బోతుంద‌ని తెలుస్తోంది. దాంతోపాటు ఓ త‌మిళ సినిమాలోనూ అవ‌కాశం వ‌చ్చింద‌నే టాక్ అయితే వినిపిస్తుంది. మ‌రి శివానీ రాజ‌శేఖ‌ర్ కెరీర్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..!