టాప్ స్టోరి: జ‌న‌సేనపై కుట్ర‌!

Last Updated on by

వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌ట‌మే నా ల‌క్ష్యం, కొత్త రాజ‌కీయానికి నాంది ప‌లక‌డానికే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, పార్టీ పెట్టాన‌ని చెబుతున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ పార్టీ గుర్తుపై ప్ర‌త్యర్థులు దుష్ప్ర‌చారం చేయ‌డం ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. జ‌న‌సేన పార్టీ గుర్తు ర‌ద్దంటూ ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డం. ఆ వార్త దావాన‌లంలా వ్యాపించ‌డంతో జ‌న‌సైనికుల్లో ఆందోళ‌న మొద‌లైంది. త‌మ పార్టీ గుర్తుపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

జ‌న‌సేనా పార్టీ గుర్తుపై జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఎలాంటి వాస్త‌వం లేదు. ఎన్నిక‌ల గాజు గ్లాసు గుర్తులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు. త‌ప్పుడు ప్ర‌చారాన్ని న‌మ్మొద్దంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ కార్య‌ద‌ర్శి పి. హ‌రిప్ర‌సాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. త‌మ పార్టీపై ప‌నిగ‌ట్టుకుని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఈ కుట్ర‌ని ప్ర‌తి కార్య‌క‌ర్త గ‌మ‌నించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జ‌న‌సేన ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును ర‌ద్దు చేసిందంటూ సామాజిక మాధ్య‌మాల్లో కొన్ని అరాచ‌క శ‌క్తులు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, పార్టీ ప్ర‌క‌ట‌న‌ల‌తో పాటు నాయ‌కుల సంత‌కాల‌ను ఫోర్జ‌రీ చేసి గంద‌ర‌గోళం సృష్టించే కుట్ర జ‌రుగుతోంద‌ని పార్టీ శ్రేణుల్ని అప్ప‌మ‌త్తంగా వుండాల‌ని సూచించారు. ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాలు, దుష్ప్ర‌చారాన్ని న‌మ్మేంత అమాయ‌కులు ఎవ‌రూ లేర‌ని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Also Read: Nagababu  Files Nomination Resting Hopes On Pawan Kalyan

User Comments