గ‌ర్భంతోనే కెమెరా ఎత్తింది!

Last Updated on by

ఎనిమిది నెల‌ల గ‌ర్భంతో ఆన్ లొకేష‌న్ ఎంతో హ‌డావుడి మ‌ధ్య కెమెరా ఉమెన్‌గా ప‌ని చేయ‌డం అంటే ఆషామాషీనా? ఇలాంటివి హాలీవుడ్‌లోనే సాధ్యం. వ‌ర్క్ యాటిట్యూడ్ ఉండే అలాంటి చోట ఆడ‌వాళ్లు ఏదైనా చేయ‌గ‌ల‌రు. సాహ‌సోపేత‌మైన లైఫ్‌స్టైల్‌ని వాళ్లు ఆస్వాధిస్తారు. ఆస్కార్ కి నామినేట్ అయిన ప్ర‌ఖ్యాత మ‌హిళా కెమెరాఉమెన్ రాచెల్ మోరిస‌న్ గురించి చెబుతూ మంచు ల‌క్ష్మి ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్‌ని పెట్టారు.

ఓ ప్ర‌ఖ్యాత ఆంగ్ల ప‌త్రిక ఇంట‌ర్వ్యూలో రాచెల్ త‌న అనుభ‌వం గురించి ఆస‌క్తిక‌ర సంగతుల్ని చెప్పారు. “గ‌ర్భిణి అంటే ఏ ప‌నీ చేయ‌కూడ‌ద‌ని భావిస్తుంటారు. నేను ఎనిమిది నెల‌ల గ‌ర్భిణిగా ఉంటూనే ఓ ఫీచ‌ర్ ఫిలిం కోసం ప‌ని చేశాను. ప్రతి గ‌ర్భిణికి ఒకేలా ఉండ‌దన్న సంగ‌తిని గ్ర‌హించాలి. నేనేమీ సూప‌ర్ ఉమెన్‌ని కాను. కేవ‌లం ఉపాధి కోస‌మే అలా చేశాను“ అని రాచెల్ తెలిపింది. రాచెల్ బ్లాక్‌పాంథ‌ర్‌, మ‌డ్‌బౌండ్, ఫ్రూట్‌వేల్ స్టేష‌న్ వంటి చిత్రాల‌కు ప‌ని చేశారు. బ్లాక్‌పాంథ‌ర్‌కి గాను ఆస్కార్‌కి నామినేట్ అయ్యారు. ఇది ఎంద‌రికో ఆద‌ర్శం కావాలి. ఇలాంటి స్ఫూర్తివంత‌మైన పోస్ట్‌ని పెట్టిన ల‌క్ష్మీ మంచును అభినందించి తీరాలి.

User Comments