ఆస్కార్ -2019 కీ అప్‌డేట్స్‌

Last Updated on by

2018 ఆస్కార్ ఉత్స‌వాల గురించి గ‌త కొంత‌కాలంగా చ‌ర్చోప‌చర్చ‌లు సాగాయి. వివాదాస్ప‌ద చిత్రం `ది షేప్ ఆఫ్ వాట‌ర్స్‌` ఉత్త‌మ చిత్రం అవార్డ్ అందుకుంది. ఇన్‌సెప్ష‌న్ ఫేం క్రిస్టోఫ‌ర్ నోలాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వార్ డ్రామా `డ‌న్‌కిర్క్` ఏకంగా నాలుగు పుర‌స్కారాలు ద‌క్కించుకుని సంచ‌ల‌నం సృష్టించింది. ఇలాంటి ఎన్నో గ్రేట్ సినిమాల్ని ఆస్కార్ క‌మిటీ ప‌రిశీలించింది. ప‌లువురు భార‌తీయ సంత‌తి న‌టుల‌కు ఈ వేడుక‌లో గుర్తింపు ల‌భించింది.

ఇక‌పోతే 2019 ఆస్కార్‌ల సంగ‌తేంటి. కీల‌క తేదీల వివ‌రాలేంటి? నామినేష‌న్లు ఎప్ప‌టికి స‌మ‌ర్పించాలి? ఎప్పుడు ప్ర‌క‌టిస్తారు? త‌దిత‌ర వివ‌రాల్ని తాజాగా అకాడెమీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ & సైన్స్ సిద్ధం చేసింది. ఆ మేర‌కు ఏబీసీ టీవీ చానెల్‌లో 91వ ఆస్కార్ అవార్డ్స్ కు సంబంధించిన కీల‌క స‌మాచారం అందించింది. 22 జ‌న‌వ‌రి 2019- ఆస్కార్- 2019 నామినేష‌న్స్‌ను ప్ర‌క‌టిస్తారు. 24 ఫిబ్ర‌వ‌రి 2019- ఆస్కార్ వేడుక ఘ‌నంగా జ‌రుగుతుంది. జ‌న‌వ‌రి 7 నుంచి వారం పాటు నామినేష‌న్ ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. ఈ ఏడాది న‌వంబ‌ర్ 18న గ‌వ‌ర్న‌ర్ అవార్డ్స్ పేరుతో తొలి ఉత్స‌వం ప్రారంభ‌మై, జ‌న‌వ‌రి 7 – ఫిబ్ర‌వ‌రి 19 వ‌ర‌కూ ఎంపిక‌ల ప్ర‌క్రియ సాగుతుంది. అటుపై ఫిబ్ర‌వ‌రి 24న అవార్డులు ఎవరికి ద‌క్కాయో ప్ర‌క‌టించేస్తారు.

User Comments