ఆస్కార్ బరిలో రాజీ, ప‌ద్మావ‌త్

Last Updated on by

2019 ఆస్కార్‌ల‌ వేడి మొద‌లైంది. జ‌న‌వ‌రిలో పుర‌స్కారాలు అందించ‌నున్నారు కాబ‌ట్టి, ఆ మేర‌కు ఇప్ప‌టినుంచే ప్రాంతీయ ప‌రిశ్ర‌మ‌ల్లో చ‌ర్చ మొద‌లైంది. ఈసారి ఇండియా నుంచి ప్రాంతీయ కేటగిరీలో వెళ్లే సినిమాలేవి? అన్న చ‌ర్చ సాగుతోంది. దాదాపు 29 సినిమాలు ఇప్ప‌టికే లిస్ట్‌లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. అందులో ప్ర‌ధానంగా ప‌ద్మావ‌త్ 3డి, రాజీ చిత్రాలు అగ్ర‌భాగాన నిలిచాయ‌న్న చ‌ర్చ సాగుతోంది. ఎప్ప‌టిలానే బాలీవుడ్ నుంచి అర‌డ‌జ‌నుపైగానే చిత్రాలు ఆస్కార్ బ‌రి నామినేష‌న్ల బ‌రిలో నిలిచాయి. త‌మిళం, గుజ‌రాతీ, మ‌రాఠీ, అస్సామీ చిత్రాలు బ‌రిలో ఉన్నాయి.

దీపిక‌- భ‌న్సాలీ జోడీ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం ప‌ద్మావ‌త్ 3డి, ఆలియాభ‌ట్ – విక్కీ కౌశ‌ల్ జంట‌గా న‌టించిన రాజీ చిత్రాలతో పాటు, వ‌రుణ్ ధావ‌న్‌- బానిట సంధుల `అక్టోబ‌ర్‌`, నందితాదాస్- న‌వాజుద్దీన్ సిద్ధిఖిల `మాంటో` నామినేష‌న్ల రేసులో ఉన్నాయి. అక్ష‌య్ – ప్యాడ్ మ్యాన్‌, అమితాబ్-రిషీజీ- 102 నాటౌట్‌, ల‌వ్ సానియా చిత్రాలు రేస్‌లో ఉన్నాయి. మ‌రాఠా నుంచి బోగ్డ‌, న్యూడ్, గులాబ్ జామ్, గుజ‌రాతీ నుంచి రేవ‌, బెస్ట్ ఆఫ్ ల‌క్ లాలు, త‌మిళం నుంచి టు లెట్‌, కోల‌మావు కోకిల‌, అస్సామీ నుంచి విలేజ్ రాక్‌స్టార్ చిత్రాలు ఆస్కార్ నామినేష‌న్ల బ‌రిలోకి ఉన్నాయిట‌. నేటి సాయంత్రానికి ఈ జాబితాపై ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.

User Comments