92వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానం కొద్దిసేపటి కిందటే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగింది. కొరియన్ చిత్రం `ప్యారాసైట్` పలు అవార్డులకి ఎంపికకావడం ఆస్కార్ అవార్డుల చర్రితలో ఓ కొత్త అధ్యాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆంగ్ల చిత్రాలే ఉత్తమ చిత్రంగా నిలవడం ఆనవాయితీ. వేరే భాషల్లో వచ్చిన సినిమాలకి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో పురస్కారాలు లభిస్తుంటాయి. కానీ `ప్యారాసైట్` కొరియన్ చిత్రమైనా… ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ మరియు ఉత్తమ దర్శకుడితో సహా నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఆంగ్లేతర చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి. పైగా విదేశీ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతోపాటు, ఉత్తమ చిత్రంగా కూడా అదే విజేతగా నిలవడం గమనార్హం. ఈ ఎంపిక వివాదాస్పదమయ్యే అవకాశాలున్నాయనేది సినీ వర్గాల మాట.
ఆస్కార్ 2020 విజేతల పూర్తి జాబితా ఇదీ…
* ఉత్తమ చిత్రం: పారాసైట్
* ఉత్తమ నటి: రెనీ జెల్వెగర్ (జూడీ)
* ఉత్తమ నటుడు: వాకిన్ ఫీనెక్స్(జోకర్)
* ఉత్తమ దర్శకుడు: పారాసైట్ (బోన్‌జోన్ హో)
* ఉత్తమ సంగీతం: జోకర్ (హిల్దార్)
* మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: బాంబ్ షెల్
* ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారాసైట్
* ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 1917 (రోచ్‌రాన్, గ్రెగ్ బట్లర్, డోమినిక్ తువే)
* ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ(మైఖేల్ మెక్‌సుకర్, ఆండ్రూ బక్‌ల్యాండ్)
* ఉత్తమ సినిమాటోగ్రఫీ: 1917(రోజర్ డికెన్స్)
* ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ(డొనాల్డ్ సిల్వెస్టర్)
* ఉత్తమ సౌండ్ మిక్సింగ్: 1917(మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్)
* ఉత్తమ సహాయనటి: లారా డ్రెన్(మ్యారేజ్ స్టోరీ)
* ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్( వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)
* ఉత్తమ యానిమేషన్ చిత్రం: టాయ్ స్టోరీ4
* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: బాంగ్ జూన్ హో (పారాసైట్)
* ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: హెయిర్ లవ్
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: తైకా వెయిటిటి (జోజో ర్యాబిట్)
* ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- ది నైబర్స్ విండో
* ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: జాక్వెలిన్ దురన్ (లిటిల్ విమన్)
* ఉత్తమ డాక్యుమెంటరీ(ఫీచర్): అమెరికన్ ఫ్యాక్టరీ