కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిగ్ బాస్ షో వెనకాల క్యాస్టింగ్ కౌచ్ వుందని, అవకాశం ఇస్తే బాస్‌కు బదులుగా ఏమిప్తావని తనని అడిగారని, అడిగినవ్యక్తుపై తాను సీరియస్ కావడంతో అక్కడి నుంచి ఉడాయించారని ఓ టీవీ ఛానల్ యాంకర్ శ్వేతారెడ్డి చేసిన వ్యాఖ్యలు బిగ్‌బాస్ షోపై నీలి నీడలు కమ్ముకునేలా చేశాయి. ఆ తరువాత `ఫిదా` ఫేమ్ గాయత్రీ గుప్తా తనపై బిగ్ బాస్ కో ఆర్డినేటర్లు లైంగిక దాడికి పాల్పడ్డారని, మానసికంగా వేధింపులకు గురిచేశారని పోలీసులని ఆశ్రయించడం, దానికి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తోడు కావడంతో వివాదం మరింత ముదిరింది.
ఇదిలా వుంటే ఈ వివాదానికి ఓయూ స్టూడెంట్స్ మద్దతుగా నిలచి మరింత ఆజ్యం పోయడం చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ షో ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఓయు విద్యార్థులు హీరో నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోపై దాడికి బయలు దేరడం సంలచనం కలిగిస్తోంది. బిగ్ బాస్ షోని నిలుపుదలచేయాలంటూ కందుల మధు ఆధ్వర్యంలో ఓయు నుండి బయలుదేరిన విద్యార్థులు. మరికాసేపట్లో అన్నపూర్ణ స్థూడియోస్ ను ముట్టడించనున్న ఉస్మానియా విద్యార్థులు. అంటూ అప్పుడే టీవీల్లో బ్రేకింగ్‌లు మొదలయ్యాయి. ఇక్కడ ముట్టడి కుదరకపోతే నాగార్జున ఇంటిని ముట్టడించే అవకాశం వుందని గ్రహించిన పోలీసులు ఆయన ఇంటి చుట్టు బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.