ప‌డి ప‌డీ న‌వ్వేసుకున్నారు!

Last Updated on by

శ‌ర్వానంద్ – సాయిప‌ల్ల‌వి జంట‌గా హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం `ప‌డిప‌డి లేచే మ‌న‌సు`. ఈ సినిమా టీజ‌ర్ స‌హా పోస్ట‌ర్లు ఇప్ప‌టికే ఆక‌ట్టుకున్నాయి. టీజ‌ర్‌లో సాయిప‌ల్ల‌వితో శ‌ర్వా రొమాన్స్ యూత్‌ని స్పెల్ బౌండ్ చేసేసింది. అర‌కిలోమీట‌ర్ దూరం నుంచి ల‌వ్ చేస్కుంటే త‌ప్పా? అంటూ శ‌ర్వా ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్.. చెలికాడి కోస‌మే వేచి చూసే స‌ఖిగా సాయి ప‌ల్ల‌వి అభిన‌యం ఆక‌ట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని ద‌స‌రా కానుక‌గా నేడు లాంచ్ చేశారు. ఈ వీడియోలో సాయి ప‌ల్ల‌వితో శ‌ర్వా రొమాంటిక్ సీన్స్ విజువ‌లైజేష‌న్ చూపించారు. ఆన్ లొకేష‌న్ శ‌ర్వా- సాయిప‌ల్ల‌వి- హ‌ను గ్యాంగ్ చిలౌట్ ఆక‌ట్టుకుంది. బోట్ పై ప్రేమ‌జంట మ‌ధ్య రొమాన్స్, వ‌ర్షంలో త‌డుస్తూ గొడుగులో చేసుకున్న రొమాన్స్ .. ఇలా ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎలా తెర‌కెక్కించారో వీడియోలో చూపించారు. ముఖ్యంగా ఆన్ లొకేష‌న్ ఆ జంట మ‌ధ్య ఫ‌న్ ఆక‌ట్టుకుంది. స‌ర‌దా స‌ర‌దాగా సీన్స్ తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. అదే స‌ర‌దా తెర‌పైనా వ‌ర్క‌వుటైతే హిట్టే. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది కాబ‌ట్టి, ఆ రోజు ఈ స‌ర‌దా సంగ‌తేంటో జ‌నాలే తేల్చాల్సి ఉంటుంది. అంత‌వ‌ర‌కూ వేచి చూడాలి. ఎస్‌.ఎల్‌.వి. సినిమా ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

User Comments