టీజ‌ర్‌: ప‌డిప‌డి లేచే మ‌న‌సు

Last Updated on by

శ‌ర్వానంద్ క‌థానాయ‌కుడిగా – సాయి ప‌ల్ల‌వి క‌థానాయికగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కుతున్న సినిమా `ప‌డి ప‌డి లేచే మ‌న‌సు`. ఎస్‌.ఎల్‌.వి.సి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా రిలీజ‌వుతోంది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తున్నారు. తాజాగా టీజ‌ర్ రిలీజైంది. ఫ‌స్ట్ టీజ‌ర్ లుక్ ఇంప్రెస్సివ్‌.

ముందే ప్ర‌క‌టించిన‌ట్టే `ల‌వ్ ఈజ్ మ్యాజిక్‌` అన్న ప‌దానికి త‌గ్గ‌ట్టే ఈ టీజ‌ర్ కొన్ని క్ష‌ణాల పాటు యువ‌త‌రం గుండెల్లో ల‌బ్‌డ‌బ్ పెంచిందంటే అతిశ‌యోక్తి కాదు. ముఖ్యంగా ప్రేమ‌లోని మ్యాజిక్‌ని శ‌ర్వా- సాయి ప‌ల్ల‌వి జంట ఆవిష్క‌రించిన తీరుకు ముచ్చ‌ట ప‌డాల్సిందే. ఏదో అర‌కిలోమీట‌ర్ దూరం నుంచే ప్రేమించుకుంటుంటే.. ఇలా డైరెక్టుగా వ‌చ్చి అడిగేయ‌డం ఏం బాలేదు! అంటూ తెగ మొహ‌మాట ప‌డిపోతున్నాడు బుల్లోడు శ‌ర్వా. డాక్ట‌ర్ సాయి ప‌ల్ల‌వి కాస్త డేరింగ్ గాళ్. ఎమోష‌న‌ల్ .. అందుకే నేరుగా వ‌చ్చి త‌న వెంట ప‌డేవాడినే అడిగేసింది. కాఫీ షాప్, కాలేజ్ క్యాంప‌స్, గోదారిలో నావ‌.. కాదేదీ ప్రేమించుకోవ‌డానిక‌న‌ర్హం!! అన్న తీరుగా ఆ జంట రొమాన్స్ న‌భూతోన‌భ‌విష్య‌తి. మొత్తానికి ఈసారి శ‌ర్వా హిట్టు కొట్టేసేట్టున్నాడు. సాయి ప‌ల్ల‌వి మ్యాజిక్ బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేట్టు క‌నిపిస్తోంది. ఇంత‌కీ వ‌ర్షం ప‌డుతుంటే ఒకే గొడుగులో ఎలా వెళ్లాలో మాబాగానే చెప్పారు ఈ క్యూట్ క‌పుల్. హ‌ను రాఘ‌వ‌పూడి విజ‌న్‌ని మెచ్చుకుని తీరాలి. ఈ అనుభ‌వం రియ‌ల్ లైఫ్‌లో శ‌ర్వాకి క‌లిగిందా.. లేక హ‌ను రాఘ‌వ‌పూడికా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

User Comments