ప‌ద్మ శ్రీ అందుకున్న సిరివెన్నెల‌

గీత ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్ర్తికి కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ప‌ద్మ శ్రీ అవార్డు ప్ర‌కటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తెలుగు సిని ర‌చ‌యిత‌ల సంఘం ఆయ‌న్ని ఘ‌నంగా స‌న్మానించింది. టాలీవుడ్ లో తొలిసారి ప‌ద్మ శ్రీ అందుకున్న ర‌చ‌యిత‌గాను సిరివెన్నెల‌ రికార్డు సృష్టించారు. తాజాగా శ‌నివారం రాష్ర్ట‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ సిరివెన్నెల‌కు ప‌ద్మ శ్రీ పుర‌స్కారం ప్ర‌ధానం చేసారు. ఈ సంద‌ర్భంగా తీసిన కొన్ని ఫోటోల‌ను శిష్యుడు రామ‌జోగ‌య్య శాస్ర్తి సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

గురువు గారు ప‌ద్మ శ్రీ అందుకున్నారంటూ ఆనందం వ్య‌క్తం చేసారు. ఇదే కార్య‌క్ర‌మంలో న‌టుడు మ‌నోజ్ బాజ్ పాయ్, స్వ‌ప‌న్ చౌదరి, సునిల్ చెత్రీ పద్మ శ్రీలు అందుకున్నారు. కాగా ఇప్ప‌టికే సిరివెన్నెల ఇంట ఎన్నో పుర‌స్కారాలు వెలిసాయి. రాష్ర్ట ప్ర‌భుత్వం 11 నంది అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సిరివెన్నెల ప‌లు టాలీవుడ్ సినిమాల‌కు సాహిత్యం అందిస్తూ బిజీగా ఉన్నారు. ఆయ‌న శిష్యులు ఎంద‌రో ర‌చ‌యిత‌లుగాను పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించి ఉన్న స్థానాల‌కు చేరారు.