షారుక్ అయిపోయాడు.. నెక్ట్స్ స‌ల్మానేనా..?

బాలీవుడ్ లో హీరోయిన్ల‌ను త‌క్కువ‌గా చూస్తుంటారు. వాళ్ల‌కేం చేత కాదు.. అందాలు ఆర‌బోయ‌డం త‌ప్ప అన్న‌ట్లుంటారు. కానీ ఇప్పుడు దీపిక ప‌దుకొనే మాత్రం బాక్సాఫీస్ ను కుమ్మేస్తుంది. ఈమె జోరు ముందు స్టార్ హీరోల రికార్డులు కూడా గ‌ల్లంతైపోతున్నాయి. ఈ ప‌ద్మావత్ జోరు ముందు షారుక్ సైతం త‌ల వంచ‌క త‌ప్ప‌లేదు. ఈ చిత్రం విడుద‌లై మూడు వారాలు గ‌డిచినా ఇప్ప‌టికీ జోరు త‌గ్గ‌డం లేదు. క‌నీసం 5 కోట్ల‌కు త‌గ్గ కుండా వీకెండ్స్ లో క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతుంది ప‌ద్మావ‌త్. ఇప్ప‌టికే ఇండియాలో 240 కోట్ల మార్క్ అందుకుంది ఈ చిత్రం. దాంతో షారుక్ ఖాన్ పేరు మీదున్న చెన్నై ఎక్స్ ప్రెస్ రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోయాయి. ఈ చిత్రం ఇండియాలో 224 కోట్లే వ‌సూలు చేసింది. ఆ సినిమా వ‌సూళ్ల‌ను చాలా తేడాతో వెన‌క్కి నెట్టేసింది ప‌ద్మావ‌తి. ఇప్పుడు ఈమె క‌న్ను300 కోట్ల‌పై ప‌డింది.

ప్ర‌పంచవ్యాప్తంగా ఇప్ప‌టికే ప‌ద్మావ‌త్ ఖాతాలో 472 కోట్లు వ‌చ్చి చేరిపోయాయి. గ‌త మూడు వారాలుగా కొత్త సినిమాలేవీ విడుద‌ల కాక‌పోవ‌డంతో ప‌ద్మావ‌త్ కి బాగా క‌లిసొచ్చింది. మొన్న వ‌చ్చిన ప్యాడ్ మ్యాన్ కి మంచి వ‌సూళ్లు వ‌స్తున్నా కూడా త‌న వాటా తాను తీసుకుంటుంది ప‌ద్మావ‌త్. ఈ చిత్రం మ‌రో 30 కోట్ల వ‌ర‌కు ఈజీగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే ఇండియాలో 270 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తుంది ఈ చిత్రం. అంటే స‌ల్మాన్, అమీర్ రికార్డుల‌ను మిన‌హాయించి అంద‌ర్నీ వెన‌క్కి నెట్టేసిన‌ట్లే ఈ భామ‌. విడుద‌ల ముందు వ‌ర‌కు వివాదాలు వెక్కిరించినా.. ఒక్క‌సారి విడుద‌లైన త‌ర్వాత ఈ చిత్రాన్ని అడ్డుకునే వాడే లేడు. అప్ప‌టి వ‌ర‌కు ర‌చ్చ చేసిన క‌ర్ణిసేన కూడా భ‌న్సాలీ దృశ్య‌కావ్యం ముందు త‌ల వంచేసారు. మొత్తానికి దీపిక స్టార్ హీరోల రికార్డుల‌ను కూడా ఇప్పుడు ప‌క్క‌కు త‌ప్పించేస్తుంద‌న్న‌మాట‌.

User Comments