Last Updated on by
టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలపై కూడా ఇంత రచ్చ జరగలేదు. బ్యాన్ అయిన సినిమాలు విడుదల చేసినపుడు కూడా ఇంత గలాటా జరగలేదు. కానీ పద్మావత్ అనే ఒక్క సినిమాపై మాత్రం ఓ రేంజ్ లో రచ్చ జరుగుతుంది. ఇండియాలో ఎన్నో సమస్యలు ఉండగా.. ఇప్పుడు కర్ణి సేనకు కేవలం ఈ చిత్రాన్ని అడ్డుకోవడమే పని అయిపోయింది. ఇందులో ఏముందో తెలియకుండానే ఆపేస్తాం అంటూ ఎగబడిపోతున్నారు. థియేటర్స్ ని తగలబెడతామని హెచ్చరింపులకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేస్తున్నారు దర్శక నిర్మాతలు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మళయాల ప్రీమియర్స్ కూడా రెండు రోజుల ముందే వేస్తున్నారు. జనవరి 23నే హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ పడుతుంది.
సెలెబ్రెటీస్ తో పాటు మీడియా ప్రముఖులకు కూడా రెండ్రోజుల ముందే సినిమా చూపిస్తున్నారు. ఇది కూడా ఒకందుకు మంచిదే కదా..! సినిమా ఎలా ఉందో ముందే తెలిస్తే రివ్యూలు కూడా రెండు రోజుల ముందే వెళ్లిపోతాయి. దాంతో కలెక్షన్లపై ప్రభావం కూడా పడుతుంది. తొలిరోజు సినిమాకు పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులు వెళ్లిపోతారు. ఎలాగూ సినిమా బాగుంటుందనే నమ్మకం ఉంది కాబట్టి ముందుగానే ప్రీమియర్ వేసినా నష్టం లేదనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. పైగా దానివల్ల సినిమాలో ఎలాంటి కాంట్రవర్సీలు లేవని.. ఏ భయం లేకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చనే నమ్మకం థియేటర్ ఓనర్లలో కూడా కలుగుతుంది. ఇది కూడా ఓ స్ట్రాటజీనే. మొత్తానికి రెండు రోజుల ముందు ప్రీమియర్ షోస్ పద్మావత్ కు ఎంత యూజ్ కానున్నాయో?
User Comments